
బస్టాండ్( విజయవాడ పశ్చిమ): దసరా సెలవుల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ ఎన్టీఆర్ జిల్లా నుంచి వివిధ దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి ఏసుదానం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు, విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాలకు 1,072 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు చెప్పారు.
ఈ నెల 30 నుంచి వచ్చే నెల 10 వరకు ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని, సాధారణ చార్జీలే అమలవుతాయని తెలిపారు.
అక్టోబర్ ఒకటి, రెండు తేదీల్లో 40 బస్సులను పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ నుంచి రాయలసీమ ప్రాంతాలైన రాయదుర్గం, కదిరి, అనంతపురం, పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు, కర్నూలు, నంద్యాల గుంతకల్ ప్రాంతాలకు, విజయవాడ నుంచి విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, భద్రాచలానికి ఈ ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్టు తెలిపారు.
అలాగే హైదరాబాద్, చెన్త్నె, బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చే బస్సులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకూ ఆన్‌లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్టు ఏసుదానం వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment