సిక్కోలు మరోసారి గర్జించింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ బంద్ పాటించింది. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు, న్యాయవాదులు, ఉద్యోగులు.. బంద్ విజయవంతానికి కృషి చేశారు. విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలను స్వచ్ఛందంగా మూసివేయగా.. వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఉదయమే శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. ఫలితంగా మధ్యాహ్నం వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్‌లో టీడీపీ, కాంగ్రెస్‌ల ఉనికి మాత్రం ఎక్కడా కనిపించలేదు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో బంద్ శుక్రవారం ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులు, ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు తిరగలేదు. ఉదయాన్ని రోడ్లపైకి చేరిన వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు డిపోల వద్దకు చేరుకోవడంతో బస్సులు బయటకు రాలేదు. జిల్లా కేంద్రంలో టీడీపీ వారు కనిపించలేదు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక వారు కొందరు కనిపించారు. నాయకులు ప్రధాన కూడళ్లలో తిరుగుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఏడురోడ్ల కూడలిలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై పలు చోట్ల రాస్తారోకోలు చేశారు. జిల్లా కేంద్రంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ పట్టణంలో ఎక్కడా వారు పాల్గొనలేదు. ఉదయం ఆరు గంటలకే వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కు చేరుకొని రోడ్డుపై బైఠాయించడంతో ఉదయం 9.30 గంటల వరకు బస్సులు నిలిచి పోయాయి. అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు డేఅండ్‌నైట్ కూడలి నుంచి ర్యాలీగా వైఎస్‌ఆర్ కూడలి వరకు వెళ్లారు.
ప్రభుత్వ కార్యాలయాలు, పోస్టాఫీసులు, బ్యాం కులను మూసివేయించారు. బంద్‌కు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల నుంచి మద్దతు లభించింది. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు, శ్రీకాకుళం నియోజవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త వై.వి.సూర్యనారాయణ పాల్గొన్నారు. జెడ్పీ ఉద్యోగులు ఉదయం విధులను బహిష్కరించారు.
ఎచ్చెర్ల : రణస్థలంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ఇరువైపులా వాహనాలను అడ్డు కున్నారు. పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, నాయకులు పిన్నింటి సాయ్‌కుమార్, గొర్లె అప్పలనర్సు నాయుడు పాల్గొన్నారు. చిలకపాలెంలో పార్టీ శ్రేణులు హైవేపై రాస్తారోకో, మానవ హారం నిర్వహించారు. బీఆర్‌ఏయూలు విద్యార్థులు తరగతులు బహిష్కరించి.. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు.
ఆమదాలవలస: ఆమదాలవలస నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. పార్టీ సమన్వయకర్తలు కిల్లి ర్మాహన్‌రావు, బొడ్డేపల్లి మాధురి, నాయకుడు తమ్మినేని సీతారాం ర్యాలీ చేశారు. దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు మద్దతు పలికారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు లు, పాఠశాలలు, కళాశాలలను ముట్టడించి వాటికి తాళాలు వేయించారు.
పాతపట్నం: పాతపట్నం నియోజక వర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో శుక్రవారం నిర్వహించిన బంద్ పాతపట్నం, కొత్తూరు మండలాల్లో విజయవంతమైంది. పాతపట్నంలో సమన్వయకర్త కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో నాయకులు బంద్‌ను చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు లు, పాఠశాలలను మూయించారు. కొత్తూరు మండల కేంద్రంలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా బీసీసెల్ కన్వీనర్ కొమరాపు తిరుపతిరావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది.
రాజాం: రాజాంలో బంద్ ప్రశాంతంగా సాగింది. సినిమా థియేటర్లు, విద్యాసంస్థలు, పలు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పీఎంజె బాబు, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జీటీ నాయుడు ఆధ్వర్యంలో బస్సులను అడ్డుకున్నారు.
టెక్కలి: టెక్కలిలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ైవె ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు టీడీపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు మద్దతు పలికాయి. ఆర్టీసీ డిపో ఎదుట జేఏసీ నాయకులంతా బైఠాయించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. దువ్వాడ వాణి, కోత మురళీ, సంపతిరావు రాఘవరావు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం: ఇచ్చాపురంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. దుకాణాదారులు స్వచ్ఛం దంగా బంద్ పాటించారు. పాఠశాలలు మూతపడ్టాయి. పార్టీ నాయకులు బస్టాండ్‌లో బైఠాయించి నిరసన తెలిపారు.
పలాస: పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో బంద్ పాక్షికంగా జరిగింది. ఉదయం 4గంటల నుంచే ఆర్టీసీ బస్సులు తిరగకుండా వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఆర్టీస్డీడిపో కూడలి వద్ద సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
పాలకొండ: పాలకొండలో సీమాంధ్ర ద్రోహుల దిష్టిబొమ్మలను దహనం చేసి వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ఆంజ నేయ సెంటర్ వద్ద టైర్లను కాల్చి నిరసన తెలి యజేశారు. సీతంపేటలో ప్రధాన రహదారిలో ధర్నా, రాస్తారోకో చేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. వీరఘట్టం, భామిని మండలాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి.
సమైక్య బంద్ సక్సెస్
Published Sat, Jan 4 2014 2:42 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement