Bandh sucessfull
-
బంద్ విజయవంతం
2 వేల మంది ఆందోళనకారుల అరెస్టు 32 కేసుల నమోదు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో టీడీపీ, బీజేపీ తీరుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నెల్లూరు జిల్లాలో బంద్ విజయవంతంగా జరిగింది. సీపీఐ, సీపీఎంతో పాటు వివిధ కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించి పాల్గొన్నాయి. బంద్‌కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడంతో ప్రభుత్వం పోలీసుల ద్వారా బంద్ విఫలం చేసేందుకు ప్రయత్నించింది. ప్రశాంతంగా బంద్ నిర్వహిస్తున్న సుమారు రెండు వేల మందిని అరెస్టు చేశారు. జిల్లాలో వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళనకారులు మూసి వేయించారు. జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల పరిధిలో సుమారు 400 బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. ఆందోళనకారుల మీద పోలీసులు 31 కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్, సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు దశరథరామయ్య ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. సీపీఐ నాయకులు పముజుల దశరథరామయ్య, సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులుతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేశారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, సీపీఐ జిల్లా కార్యదర్శి పార్థసారథి బంద్‌లో పాల్గొన్నారు. వెంకటాచలంలో జాతీయ రహదారిమీద బంద్‌కు ఉపక్రమిచడంతో ఉదయం 11 గంటల సమయంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఆత్మకూరు బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, కేవీఆర్ ప్రెటోల్ బంకు వద్ద సీపీఎం, సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ఉదయగిరిలో ఉదయగిరి ఉదయం 6 గంటల నుంచి బంద్ ప్రారంభించారు. ఉదయం పదిన్నర గంటల సమయంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఎం నాయకులు కాకు వెంకటయ్యతో పాటు 200 మందిని పోలీసులు అరెస్ట్‌చేసి స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కారణంగా కిలో మీటర్ల దూరం వాహనాలు నిలచిపోయాయి. దీంతో పోలీసులు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూళ్లూరుపేట – శ్రీహరికోట రోడ్లో దావాదిగుంట వద్ద రోడ్డుపై బైఠాయించారు. నియోజకవర్గంలో కోవూరులో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కోవూరులో జాతీయ రహదారి మీద ధర్నా చేసి బంద్ నిర్వహించారు. కోవూరు మండలం ఇనమడుగు వద్ద బంద్ నిర్వహిస్తున్న సీపీఎం నాయకులను అరెస్ట్ చేశారు. గూడూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డిలు పార్టీ నాయకులూ కార్యకర్తలతో కలసి ఉదయం 5 గంటలకే ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుని బస్సులు బయటకు తీయనీయకుండా చేశారు. టవర్‌క్లాక్ కూడలి వద్ద మేరిగ, ఎల్లసిరిలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఉదయం 5 గంటలకే ఎమ్మెల్యే పార్టీ నాయకులతో కలసి ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకుని బస్సులు బయటకు పోకుండా అడ్డుకున్నారు. పట్టణంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయిస్తుండగా పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో వెంకటగిరిలో నిర్వహించిన బంద్ విజయవంతం అయింది. తెల్లవారు జామున 4 గంటలనుంచే వైఎస్సార్సీపీ శ్రేణులు ఆర్టీసీ డిపోవద్ద బైఠాయించి బస్సులను నిలపుదల చేయించారు. వైఎస్సార్సీపీ శ్రేణులతోపాటు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని పోలీసులు అరెస్టు చే శారు. -
బంద్ సంపూర్ణం
కరీంనగర్ : మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాల పెంపు కోసం గత 12 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీలు శుక్రవారం ఇచ్చిన బంద్ పిలుపునకు వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు మద్దతు ప్రకటించాయి. దీంతో జిల్లావ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరిగింది. కరీం నగర్లో ఉదయం 6గంటలకే వామపక్ష పార్టీల నేతలు, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, బోయిని అశోక్, పైడిపల్లిరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, న్యూడెమోక్రసీ నాయకులు జూపాక శ్రీనివాస్, జిందం ప్రసాద్, ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ నాయకులు గవ్వ వంశీధర్‌రెడ్డి తదితరులు బస్‌డిపో ముందు బైఠాయించి బస్సులు బయటికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని అదుపులోకి తీసుకోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, పట్టణ అధ్యక్షుడు కర్ర రాజశేఖర్ ఆధ్వర్యంలో టవర్‌సర్కిల్, తెలంగాణచౌక్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించి బంద్‌లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆనంతరం నగరంలోని బస్టాండ్, ప్రధాన వ్యాపార కూడళ్లలో ఆయా పార్టీల నాయకులు తిరుగుతూ బంద్ చేయించారు. విద్యాసంస్థలు సెలవు ప్రకటించగా, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంక్‌లు మధ్యాహ్నం వరకు మూసివేశారు. వామపక్ష పార్టీలు, మున్సిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల రాస్తారోకోలు, బైక్‌ర్యాలీలు నిర్వహించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో తహశీల్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. హుజూరాబాద్‌లో సీపీఎం రాష్ట్ర నాయకులు మర్రి వెంకటస్వామి ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. గంగాధర మండల కేంద్రం లో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ ఇంటి ముందు కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు నిరసన తెలిపి బంద్‌లో పాల్గొన్నారు. సిరిసిల్లలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామల మల్లేశం ఆధ్వర్యంలో వామపక్ష పార్టీల నేతలు, కార్మికులు బంద్ పాటించారు. హుస్నాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు కేడం లింగమూర్తి, ఆకుల వెంకట్, సీపీఎం నాయకులు కొయ్యడ కొమురయ్య ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. మానకొండూరు, కోరుట్ల, మంథని, వేములవాడ, పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గ కేంద్రాల్లో వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్, టీడీపీ, విద్యార్థి యువజన సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. -
సమైక్య బంద్ సక్సెస్
సిక్కోలు మరోసారి గర్జించింది. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ బంద్ పాటించింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు, న్యాయవాదులు, ఉద్యోగులు.. బంద్ విజయవంతానికి కృషి చేశారు. విద్యాసంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలను స్వచ్ఛందంగా మూసివేయగా.. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉదయమే శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. ఫలితంగా మధ్యాహ్నం వరకు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్‌లో టీడీపీ, కాంగ్రెస్‌ల ఉనికి మాత్రం ఎక్కడా కనిపించలేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో బంద్ శుక్రవారం ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. వ్యాపారులు, ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు తిరగలేదు. ఉదయాన్ని రోడ్లపైకి చేరిన వైఎస్ఆర్ సీపీ శ్రేణులు డిపోల వద్దకు చేరుకోవడంతో బస్సులు బయటకు రాలేదు. జిల్లా కేంద్రంలో టీడీపీ వారు కనిపించలేదు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక వారు కొందరు కనిపించారు. నాయకులు ప్రధాన కూడళ్లలో తిరుగుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఏడురోడ్ల కూడలిలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై పలు చోట్ల రాస్తారోకోలు చేశారు. జిల్లా కేంద్రంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చినప్పటికీ పట్టణంలో ఎక్కడా వారు పాల్గొనలేదు. ఉదయం ఆరు గంటలకే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కు చేరుకొని రోడ్డుపై బైఠాయించడంతో ఉదయం 9.30 గంటల వరకు బస్సులు నిలిచి పోయాయి. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు డేఅండ్‌నైట్ కూడలి నుంచి ర్యాలీగా వైఎస్ఆర్ కూడలి వరకు వెళ్లారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోస్టాఫీసులు, బ్యాం కులను మూసివేయించారు. బంద్‌కు విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల నుంచి మద్దతు లభించింది. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు, శ్రీకాకుళం నియోజవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త వై.వి.సూర్యనారాయణ పాల్గొన్నారు. జెడ్పీ ఉద్యోగులు ఉదయం విధులను బహిష్కరించారు. ఎచ్చెర్ల : రణస్థలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ఇరువైపులా వాహనాలను అడ్డు కున్నారు. పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, నాయకులు పిన్నింటి సాయ్కుమార్, గొర్లె అప్పలనర్సు నాయుడు పాల్గొన్నారు. చిలకపాలెంలో పార్టీ శ్రేణులు హైవేపై రాస్తారోకో, మానవ హారం నిర్వహించారు. బీఆర్ఏయూలు విద్యార్థులు తరగతులు బహిష్కరించి.. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి వాహనాలను అడ్డుకున్నారు. ఆమదాలవలస: ఆమదాలవలస నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. పార్టీ సమన్వయకర్తలు కిల్లి ర్మాహన్రావు, బొడ్డేపల్లి మాధురి, నాయకుడు తమ్మినేని సీతారాం ర్యాలీ చేశారు. దుకాణాలను వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు మద్దతు పలికారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు లు, పాఠశాలలు, కళాశాలలను ముట్టడించి వాటికి తాళాలు వేయించారు. పాతపట్నం: పాతపట్నం నియోజక వర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో శుక్రవారం నిర్వహించిన బంద్ పాతపట్నం, కొత్తూరు మండలాల్లో విజయవంతమైంది. పాతపట్నంలో సమన్వయకర్త కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో నాయకులు బంద్‌ను చేపట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు లు, పాఠశాలలను మూయించారు. కొత్తూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ జిల్లా బీసీసెల్ కన్వీనర్ కొమరాపు తిరుపతిరావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. రాజాం: రాజాంలో బంద్ ప్రశాంతంగా సాగింది. సినిమా థియేటర్లు, విద్యాసంస్థలు, పలు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ పీఎంజె బాబు, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జీటీ నాయుడు ఆధ్వర్యంలో బస్సులను అడ్డుకున్నారు. టెక్కలి: టెక్కలిలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ైవె ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు టీడీపీ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు మద్దతు పలికాయి. ఆర్టీసీ డిపో ఎదుట జేఏసీ నాయకులంతా బైఠాయించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. దువ్వాడ వాణి, కోత మురళీ, సంపతిరావు రాఘవరావు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం: ఇచ్చాపురంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. దుకాణాదారులు స్వచ్ఛం దంగా బంద్ పాటించారు. పాఠశాలలు మూతపడ్టాయి. పార్టీ నాయకులు బస్టాండ్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. పలాస: పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో బంద్ పాక్షికంగా జరిగింది. ఉదయం 4గంటల నుంచే ఆర్టీసీ బస్సులు తిరగకుండా వైఎస్ఆర్ సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఆర్టీస్డీడిపో కూడలి వద్ద సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలకొండ: పాలకొండలో సీమాంధ్ర ద్రోహుల దిష్టిబొమ్మలను దహనం చేసి వైఎస్ఆర్ సీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ఆంజ నేయ సెంటర్ వద్ద టైర్లను కాల్చి నిరసన తెలి యజేశారు. సీతంపేటలో ప్రధాన రహదారిలో ధర్నా, రాస్తారోకో చేసి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. వీరఘట్టం, భామిని మండలాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
బంద్ సక్సెస్
-
విభజనపై నేడు జిల్లా బంద్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : రాష్ట్ర విభజనకు ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శుక్రవారం ఒక రోజు జిల్లాలో బంద్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీన ర్ మేరిగ మురళీధర్ తెలిపారు. బంద్ నుంచి అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని ఆయన చెప్పారు. విద్యాసంస్థలు, ఆర్టీసీ, ప్ర భుత్వ కార్యాలయాలను మూసివేసి బంద్‌కు సహరించాలని పిలుపునిచ్చా రు. అదేవిధంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు సహా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బంద్ విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.