సాక్షి ప్రతినిధి, నెల్లూరు : రాష్ట్ర విభజనకు ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శుక్రవారం ఒక రోజు జిల్లాలో బంద్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కన్వీన ర్ మేరిగ మురళీధర్ తెలిపారు. బంద్ నుంచి అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని ఆయన చెప్పారు.
విద్యాసంస్థలు, ఆర్టీసీ, ప్ర భుత్వ కార్యాలయాలను మూసివేసి బంద్‌కు సహరించాలని పిలుపునిచ్చా రు. అదేవిధంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు సహా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బంద్ విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.
విభజనపై నేడు జిల్లా బంద్
Published Fri, Dec 6 2013 2:52 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement