'అవసరమైతే ప్రైవేటు బస్సులను నిలిపివేస్తాం'
హైదరాబాద్:నగరంలోని రవాణా వ్యవస్థ ఆధునీకరణపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు ఆరంభించింది. ఇందుకు గాను టీ.ప్రభుత్వ బృందం ముంబై నగరానికి బయల్దేరనుంది. దీనికి సంబంధించి రవాణశాఖా మంత్రి పి. మహేందర్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ ప్రభుత్వ బృందం రవాణా వ్యవస్థ పరిశీలనకై ముంబైకి వెళ్లనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరంలో అవసరాల మేరకు కొత్తగా 80 బస్సులను నడుపుతామని తెలిపారు. నిబంధనలు పాటించని ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటామన్నారు.
అవసరమైతే ప్రైవేటు బస్సు సర్వీసులను నిలిపివేస్తామన్నారు. ఏ ప్రాంతానికి చెందిన ఆర్టీసీ అధికారులు అక్కడి నుంచే విధులు నిర్వహించాలని మహేందర్ రెడ్డి సూచించారు.