
ఆర్టీసీ బస్సులకు ఫాస్ట్‌ట్యాగ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: టోల్‌గేట్ల వద్ద ఫీజు చెల్లించడం, నెలవారీ పాస్ చూపించడం వాటితో సమయం వృథా కాకుండా ఫాస్ట్ ట్యాగ్ సిక్కర్లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ విధానాన్ని మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియ న్‌లో ఆగస్టులో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావ డంతో సెప్టెంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో దీనిని అమలు చేస్తున్నారు. ఎన్‌హెచ్–44పై మూడు టోల్‌ప్లాజాలున్నాయి. ఆర్టీసీ బస్సులు వాటి వద్ద టోల్ రుసుం చెల్లించడానికి లేదా నెలవారీ పాస్ చూపించేందుకు వేచి చూడాల్సి వచ్చేది. దీనివల్ల రద్దీ సమయాల్లో సమయం వృథా అయ్యేది.
దీనిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ఫాస్ట్‌ట్యాగ్ పద్ధతిని తీసుకొచ్చింది. బస్సుకు సంబంధించిన ఒక అద్దానికి ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ అంటిస్తారు. ఈ స్టిక్కర్‌పై బార్ కోడ్ ఉంటుంది. టోల్‌ప్లాజ్‌ల వద్దకు ఫాస్ట్ ట్యాగ్ బస్సులు చేరుకోగానే పది అడుగుల దూరంలోనే బార్‌కోడింగ్‌ను టోల్‌ప్లాజ్‌కు చెందిన స్కానర్లు స్కానింగ్ చేసుకుంటాయి. దీంతో వెంటనే అక్కడి నుంచి బస్సులు ముందుకు కదిలేలా గేట్ తెరుచుకుంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న బస్సులు వెళ్లడానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.
ఫాస్ట్‌ట్యాగ్‌తో సమయం ఆదా..
టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులకు ఫాస్ట్‌ట్యాగ్ పద్ధతి అమలు చేయడం వల్ల సమయం ఆదా అవుతోందని ఆర్టీసీ డీవీఎం మహేశ్ తెలిపారు. గతంలో టోల్‌ప్లాజాల వద్ద టికెట్ తీసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేదని చెప్పారు.