యుద్ధానికి రథసారథి ఎంత కీలకమో...ఉద్యమానికి గట్టి నాయకుడూ అంతే అవసరం. ఇన్నాళ్లుగా సమైక్య ఉద్యమం ఎంత ఉధృతంగా సాగినా నాయకత్వలోపం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఆలోటు తీరింది.సమైక్యాంధ్ర సాధన కోసం జననేత జగన్ పూరించిన సమైక్యశంఖారావం విజయవంతం కావడం, సమైక్యాన్ని సాధించే వరకూ విశ్రమించేది లేదని తేల్చిచెప్పడంతో సమైక్యవాదుల్లో కొండంత ఆత్మస్థైర్యం వచ్చింది. సమైక్యాంధ్ర సాధన జగన్‌తోనే సాధ్యమని జిల్లా అంతటా చర్చ మొదలైంది. లక్ష్యసాధన దిశగా సమైక్యఉద్యమం మళ్లీ తీవ్ర రూపం దాల్చనుంది.
పోగైంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జూలై 30న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన వెంటనే జిల్లాలో సమైక్య ఉద్యమం హోరుగా సాగింది. తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన తర్వాత మరింత జోరందుకుంది. దసరా కంటే ముందుగా ప్రభుత్వంతో చర్చల అనంతరం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లోకి వెళ్లడంతో సమైక్యాంధ్ర ఉద్యమం నెమ్మదించింది. అయితే ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు మాత్రం అలుపెరగకుండా ఉద్యమం సాగిస్తున్నారు. నిరాటంకంగా రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు.
పదిరోజులుగా జిల్లాలో ఉద్యమం చల్లబడటం, తెలంగాణపై కేంద్రం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ, పంపకాలకు సంబంధించిన నివేదికలను నవంబర్ 5లోపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులను ఆదేశించడంతో సమైక్యవాదుల్లో మరింత ఆందోళన నెలకొంది. తిరిగి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని మనసులో కసితో రగిలిపోతున్నా, నాయకుడు లేక మదనపడ్డారు. సమైక్యాంధ్రపై ప్రజల ఆకాంక్షకు అనువుగా జగన్ సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేలా రాజధానిలో శనివారం సమైక్యశంఖారావాన్ని చేపట్డారు.
భారీగా తరలివెళ్లిన ప్రజలు, ఉద్యోగులు, రైతులు:
జగన్ పిలుపుతో జిల్లా నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, ఉద్యోగులు, పార్టీ కార్యకర్తలు సమైక్యశంఖారావానికి తరలివెళ్లారు.
జిల్లా వ్యాప్తంగా 800 బస్సులు, 3వేలకుపైగా ఇతర వాహనాలతో వేలాదిమంది వెళ్లారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, సాధారణ ప్రజలు కూడా హాజరయ్యారు. దాదాపు 50వేలమందికిపైగా జిల్లా వాసులు శంఖారావంలో పాల్గొన్నారు. ఓవైపు ఎడతెరిపి లేని వర్షాలతో పంటలు నష్టపోయిన బాధ కంటే రాష్ట్రం విడిపోతే తలెత్తే బాధ మరింత ఎక్కువగా ఉంటుందని సభకు వెళ్లారు. సమైక్యకాంక్ష బలమైందని చాటిచెప్పారు. ఇన్నాళ్లూ ఉద్యమాన్ని నడిపినా రాజకీయపార్టీ అండ లేకుండా ఉద్యమాన్ని దీర్ఘకాలికంగా సాగించడం కష్టమని ఉద్యమకారులంతా ఇటీవల వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఉద్యమాన్ని తమ భుజస్కందాలపై వేసుకుని ముందుకు నడిపిస్తామని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట మేరకు ఏరాజకీయపార్టీ చేయని విధంగా జిల్లాలో నిర్విరామంగా రిలేదీక్షలు చేస్తున్నారు. అంతటితో ఆగకుండా సమైక్యశంఖారావాన్ని చేపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంతవరకూ విశ్రమించేది లేదని, వందేమాతరం నినాదంతో ప్రతి ఒక్కరూ సమైక్య జెండాలతో ముందుకు రావాలని జగన్ పిలుపున్విడంతో సమైక్య ఉద్యమంలో జిల్లాలో మరోసారి ఉధృతంగా సాగనుందని జిల్లా వ్యాప్తంగా శనివారం చర్చలు మొదలయ్యాయి. జగన్‌మోహన్‌రెడ్డితోనే సమైక్యసాధన సాధ్యమని, పార్టీ భవిష్యత్తును కూడా పట్టించుకోకుండా ప్రజల కోసం నిష్కల్మషంగా సమైక్యరాష్ట్రం కోసం పోరాడుతున్న ఏకైక నాయకుడు జగనే అని హోటళ్లు, బస్టాండ్, ప్రధాన కూడళ్లలో చర్చించుకుంటున్నారు. రాజకీయపార్టీలలో సమైక్యబాటలో నడుస్తున్న ఏకైకపార్టీ వైఎస్సార్‌సీపీనే. శంఖారావం విజయోత్సాహంతో పార్టీ శ్రేణులు కూడా సమరోత్సాహంతో ఉన్నాయి.
ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ సమాయత్తం అవుతోంది. ప్రజలు ఇంత వేదన పడుతున్నా, కేంద్రం దారుణంగా వ్యవహరిస్తున్నా వైఎస్సార్‌సీపీ మాత్రమే ప్రజల పక్షాన పోరాడుతోందని, జిల్లాలోని టీడీపీ, కాంగ్రెస్ నేతలు పూర్తి స్తబ్దుగా ఉండటాన్ని జిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు ఇలాంటి విపత్కర సమయంలోనూ అండగా నిలవకపోవడం ఏంటని మండిపడుతున్నారు. సమైక్యవాదాన్ని వినిపిస్తున్న వైఎస్సార్‌సీపీ తో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సమైక్యవాదులు సన్నద్ధమవుతున్నారు.
సమరోత్సాహం
Published Sun, Oct 27 2013 3:06 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement