బచ్చన్నపేట : కాలేజీలకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు రాస్తారోకో కు దిగారు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 600 మంది విద్యార్థులు జనగామలోని కళాశాలలకు వెళుతుంటారు. కానీ వీరికి ఒకే ఒక్క ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంది. దాంతో వేరే వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం సుమారు 450 మంది విద్యార్థులు మండల కేంద్రంలోని చౌరస్తాలో రాస్తారోకో చేశారు. మరో రెండు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జనగామ ఆర్టీసీ డిపో మేనేజర్‌తో మాట్లాడగా... చర్చించేందుకు రావాలని విద్యార్థులను ఆహ్వానించారు.
..........................