
ఆ బస్సులు ఏపీలో తిరిగితే సీజ్
►సీఎంతో ముగిసిన రవాణాశాఖాధికారుల భేటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడితో రవాణా శాఖ ఉన్నతాధికారుల భేటీ ముగిసింది. అరుణాచల్‌ప్రదేశ్ రవాణాశాఖ రిజిస్ట్రేషను రద్దు చేసిన బస్సులను ఏపీలో తిరిగితే సీజ్ చేయాలని నిర్ణయించారు. మంగళవారం రాత్రి నుంచి బస్సులను సీజ్ చేసేందుకు రవాణావాఖ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులకు ఈ మేరకు రవాణాశాఖ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 900 బస్సులుంటాయని అంచనా. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.