
మోటార్ సైకిల్‌పై అసెంబ్లీకి..!
సాక్షి, హైదరాబాద్: ఆయనో ఎమ్మెల్యే.. వరుసగా మూడోసారి గెలిచారు. అయితేనేమీ..! అసెంబ్లీకి మోటార్ సైకిల్‌పై వచ్చారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య శనివారం బైక్‌పై అసెంబ్లీకి రావటం అందరినీ ఆశ్చర్యపరిచింది. గత సమావేశాల వరకు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా వాహన వసతి కల్పించింది.
క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి, సమావేశాలు ముగిశాక తిరిగి క్వార్టర్స్ వరకు ఎమ్మెల్యేలు వెళ్లేందుకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడిపింది. క్రమంగా ఈ బస్సుల్లో వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది. దీంతో బస్సును ప్రభుత్వం రద్దు చేసింది. వాహన సదుపాయాన్ని పునరుద్ధరిం చాలని ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. స్పందన రాకపోవడంతో రాజయ్య మోటార్ బైక్‌పైనే అసెంబ్లీకి వచ్చి వెళ్లారు.