వీఆర్వో,వీఆర్‌ఏ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. వీటి నిర్వహణకు కలెక్టర్ సారథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు జిల్లా వ్యాప్తంగా సమకూర్చారు. పోలీసు పరంగా కూడా గట్టి బందోబస్తు సిద్ధం చేశారు. ఈ మారు వీడియోల వినియోగం, వేలిముద్రల సేకరణ వంటివి చేపట్టి నకీలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఈనెల 2న ఆదివారం జిల్లాలో నిర్వహించే వీ ఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఒ క్క సెకండు అలస్యమైనా అనుమతించబోమని జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ వెల్లడించారు. పరీక్షల నిర్వాహణపై శుక్రవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. అభ్యర్థులంతా తమకు కేటాయించిన కేంద్రాలకు గంట ముందుగా ఉదయం 9గంటలకే చేరుకోవాలన్నారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించే ఈ పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. ఈసారి కొత్తగా అభ్యర్థుల వేలిముద్రల్ని సేకరించాకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని, ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ప్రతీ సెంటర్ వద్ద అభ్యర్థులను వీడియో గ్రఫీతోపాటు, పురుషులను, స్త్రీలను విడిగా తనిఖీ చేయనున్నామన్నారు. అభ్యర్థులు పరీక్ష ప్యాడ్‌తోపాటు, బ్లూ, బ్లాక్ బాల్ పెన్ను తప్పనిసరిగా తీసుకొని రావాలన్నారు. అర్టీసీ బస్సు సదుపాయంతోపాటు, తాగునీరు, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్ష కేంద్రాల దగ్గర
144సెక్షన్ అమలు.....
పరీక్షల నిర్వాహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా, ప్రతీ కేంద్రం దగ్గర 144సెక్షన్‌ని విధించారు. పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని, సమస్యాత్మకమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అదే విధంగా జిరాక్స్ సెంటర్లన్నీ మూసేయాలని, ఎవరైనా తెరిచినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
81,993మంది అభ్యర్థులు
దరఖాస్తు చేసుకొన్నారు......
ఈనెల 2న నిర్వహించే వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలకు గాను 81,993మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. ఇక జిల్లాలో ఖాళీగా పోస్టుల విషయానికొస్తే 103వీఅర్వో పోస్ట్‌లకు గాను 80,674 మంది, 94విఆర్‌ఏ పోస్ట్‌లకుగాను 1986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో రెండింటికి దరఖాస్తు చేసుకొన్న వారు 806మంది ఉన్నారు. ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 5డివిజన్ కేంద్రాలతోపాటు, 10పట్టణప్రాంతాల్లో 243 పరీక్ష కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఇక వీఆర్వొ, వీఆర్‌ఏ రెండు పరీక్షలు రాసే అభ్యర్థులకైతే జిల్లా కేంద్రంలోనే 8పరీక్ష కేంద్రాలను గుర్తించారు. వీరు ఈ కేంద్రాల్లోనే పరీక్ష రాయాల్సి ఉంటోంది. అప్రకారమే వారికి హాల్ టిక్కెట్లను జారీ చేశారు. ఈసారి రెండు పరీక్షలు రాసే అభ్యర్థులందరికి ఒకే దగ్గర పరీక్ష కేంద్రాలను కేటాయించడంతో, ఉదయం వీఆర్వొ, మధ్యాహ్నం వీఆర్‌ఏ పరీక్షల్ని రాసే సదుపాయాన్ని కల్పించారు.
-పరీక్ష సమయం వీఆర్వొ ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వీఆర్‌ఏ మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు .
సిబ్బంది నియామకం పూర్తి.......
పరీక్షలకు సంబంధించి 5కేంద్రాలకో రూట్‌గా చేసిమొత్తం 43రూట్‌లను అధి కారులు గుర్తించారు. ఇందుకుగాను 36 మంది జిల్లా స్థాయి అధికారులను పరిశీ లకులుగా ఉంటారు. రూట్, లైజాన్ అధికారులుగా 45మంది తహశీల్దార్లను నియమించారు. డిప్యూటీ తహశీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్, ఎంఅర్‌ఐలను కలిపి అసిస్టెంట్ లైజాన్ అధికారులతోపాటు, సిట్టింగ్‌స్క్వాడ్స్‌గా ఉంటారు. చీఫ్ సూపరింటెండెంట్లుగా 108మంది, ఇన్విజిలేటర్స్‌గా 3784మంది అధికారులు వ్యవహరిస్తారు.
నకిలీ అభ్యర్థులపై
ప్రత్యేక నిఘా..
ఈసారి నకిలీ అభ్యర్థులను గుర్తించేందుకుగాను ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రంల్లోకి వచ్చేటప్పుడు అభ్యర్థుల వీడియో గ్రఫీని తీసుకొన్న అనంతరం, వారు పరీక్షలు రాసేటప్పుడు ముందుగా దరఖాస్తు చేసుకొన్నది వారా కాదా అనేది మరోసారి నిర్ధారించుకుంటారు. గతంలో ఒకరికి బదులు ఇంకొకరు పరీక్షలు రాస్తూ పట్టుబడిన దృష్ట్యా ఈసారి పకడ్బందీగా వ్యవహరిస్తామని అధికారులు చెబుతున్నారు.
నిబంధనలు ఇవే.......
సెకండు అలస్యమైనా పరీక్ష కేంద్రం లోకి అనుమతించరు.
సెల్‌ఫోన్, కాలిక్యులేటర్, బ్లేడ్ వం టి వి తీసుకరాకూడదు.
ఒకవేళ వాటిని తెచ్చినా పరీక్షా కేం ద్రాల అవరణలో ఉంచనివ్వరు. బయటనే తమవారి వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష కేంద్రంల్లోనికి బయటవారికి అనుమతి లేదు.
పరీక్ష ప్రారంభం అయినప్పటి నుం చి పూర్తయ్యేంత వరకూ అభ్యర్థులు హాల్‌లోనే ఉండాలి
జెల్, ఇంకూ పెన్నులు వంటివి వాడరాదు.
ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వారు ఈ పరీక్షలో పాల్గొనేందుకు వారి ఉన్నతాధికారినుంచి అనుమతి తప్పనిసరిగా ఉండాలి. లేని పక్షంలో సీసీఎల్‌ఏ నిబంధనల ప్రకారం చర్యలుంటాయి.
అర్టీసి బస్సులు.......
ఈ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకుగాను అన్ని రూట్లకు సరిపడా బస్సుల్ని నియమించడతోపాటు, అదనంగా 54బస్సుల్ని కేటాయించినట్లు ప్రకటించింది.
సెకను లేటైనా నో ఎంట్రీ!
Published Sat, Feb 1 2014 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement
Advertisement