రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..15 మందికి గాయాలు | 15 injured in road accident at suryapet | Sakshi
Sakshi News home page

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..15 మందికి గాయాలు

Published Tue, Apr 28 2015 9:16 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

15 injured in road accident at suryapet

సూర్యాపేట రూరల్: నల్లగొండ జిల్లా సూర్యాపేట నుంచి వరంగల్ జిల్లా జనగామకు వెళ్లే రహదారిలో గాంధీనగర్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సూర్యాపేట డిపోకు చెందిన రెండు బస్సులు జనగామ వైపు వెళుతుండగా ముందున్న బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో... వెనుక బస్సు ముందు బస్సును ఢీకొట్టగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు తెలిపారు. సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement