
నెల్లూరు (క్రైమ్): ఆర్టీసీ బస్సుల్లో తమిళనాడుకి ప్రయాణించేవారు ఈ–పాస్‌ను తప్పనిసరిగా పొందాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (ఏపీపీటీడీ) ఆర్‌ఎం పీవీ శేషయ్య ఆదివారం తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం శనివారం రాత్రి నుంచి ఆంక్షలను కఠినతరం చేసిందని పేర్కొన్నారు.
ఇకపై ఏపీ, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి తమిళనాడుకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ పాస్ పొందాలని ఆదేశించినట్లు వివరించారు. ప్రయాణికులు https.eregister.tnega.org వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకుంటే వారి ఫోన్ నంబర్‌కు ఈ పాస్ మెసేజ్ వస్తుందన్నారు. నెల్లూరు రీజియన్ నుంచి చెన్నై వెళ్లేవారు వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment