E pass
-
సరిహద్దుల్లో భారీగా నిలిచిన వాహనాలు
గరికపాడు (జగ్గయ్యపేట అర్బన్)/నందిగామ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణలో పగటి పూట లాక్డౌన్ ఎత్తివేయడంతో పాటు ఆదివారం కావడంతో ఆంధ్రా నుంచి వెళుతున్న వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. తెలంగాణలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద, నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద తెలంగాణలోకి వెళ్లే వాహనాలను ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ప్రజలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉదయం నుంచి వాహనాలను నిలిపేయడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తెలంగాణలోని కోదాడ పట్టణ ఎస్ఐ సైదులు మాట్లాడుతూ ఈ–పాస్ లేని వాహనాలకు అనుమతి లేదని చెప్పారు. రామాపురం చెక్‌పోస్టు మీదుగా రాత్రి నుంచి ఇప్పటివరకు ఈ–పాస్ ఉన్న 700కు పైగా వాహనాలను అనుమతించామని, ఈ–పాస్ లేని 1,500 వాహనాలను వెనక్కు పంపామని తెలిపారు. ప్రయాణికులు ఈ–పాస్‌తో వచ్చి పోలీసులకు సహకరించాలని కోరారు. తెలంగాణలోని మధిర పట్టణం రెడ్‌జోన్ కావడంతో ఎవ్వరినీ అనుమతించబోమని, ఈ పాస్ ఉన్న వారిని మాత్రమే వెళ్లనిస్తామని జొన్నలగడ్డ వద్ద పోలీసులు చెప్పారు. దీంతో చేసేదిలేక కొందరు వెనుదిరగగా, అక్కడే మధ్యాహ్నం వరకు వేచి ఉన్న వారిని మాత్రం ఎట్టకేలకు పోలీసులు అనుమతించారు. -
తెలంగాణ లోకి రావాలంటే ఈ - పాస్ తప్పనిసరి అంటున్న పోలీసులు
-
తమిళనాడుకి వెళ్లాలంటే ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
నెల్లూరు (క్రైమ్): ఆర్టీసీ బస్సుల్లో తమిళనాడుకి ప్రయాణించేవారు ఈ–పాస్‌ను తప్పనిసరిగా పొందాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (ఏపీపీటీడీ) ఆర్ఎం పీవీ శేషయ్య ఆదివారం తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం శనివారం రాత్రి నుంచి ఆంక్షలను కఠినతరం చేసిందని పేర్కొన్నారు. ఇకపై ఏపీ, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి తమిళనాడుకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ పాస్ పొందాలని ఆదేశించినట్లు వివరించారు. ప్రయాణికులు https.eregister.tnega.org వెబ్సైట్లో పేర్లను నమోదు చేసుకుంటే వారి ఫోన్ నంబర్‌కు ఈ పాస్ మెసేజ్ వస్తుందన్నారు. నెల్లూరు రీజియన్ నుంచి చెన్నై వెళ్లేవారు వెబ్సైట్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. -
తమిళనాడు వెళ్లాలంటే ‘ఈ–పాస్’ తప్పనిసరి
సాక్షి, చెన్నై: తమిళనాడుకు వెళ్లాలంటే ఇక ఈ–పాస్ తప్పనిసరి అని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో మూడు రాష్ట్రాల వారికి మినహాయింపు కల్పించారు. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడు లోనూ క్రమంగా కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వెళుతున్న వారి రూపంలోనే కేసులు పెరుగుతున్నట్టు పరిశీలనలో తేలింది. దీంతో తమిళనాడులోకి వెళ్లాలంటే, ఈ–పాస్ పొందాల్సిందేనన్న ప్రకటనను ఆదివారం ఆరోగ్యశాఖ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరిల నుంచి వచ్చేవారికి మాత్రం ఈ–పాస్ నుంచి మినహాయింపు కల్పించింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఇక్కడకు నేరుగా వచ్చే వాళ్లు, ఇతర రాష్ట్రాల మీదుగా విదేశాల నుంచి తమిళనాడులోకి వెళ్లే వాళ్లు తప్పనిసరిగా ఈ–పాస్ పొందాల్సిందేనని స్పష్టం చేసింది. -
నేటి నుంచి తెలంగాణలో ఈ-పాస్ విధానం
-
స్టాక్ పాయింట్లలో ఈ–వేయింగ్ మిషన్లు
సాక్షి, అమరావతి: రేషన్ దుకాణాల్లో తూకాల్లో మోసాలను అరికట్టేందుకు ఈ–పాస్ యంత్రాలను వినియోగిస్తున్నట్లే ఇకపై మండల స్థాయి స్టాక్ పాయింట్లలోనూ (ఎంఎల్ఎస్) అవకతవకలకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. స్టాక్ పాయింట్లలో ఈ–వేయింగ్ మిషన్లను తప్పనిసరి చేస్తూ పౌర సరఫరాల సంస్థ నిర్ణయం తీసుకుంది. స్టాక్ పాయింట్ల వద్ద 50 కిలోల బస్తా నుంచి 1–2 కిలోల బియ్యం తీసి, డీలర్లకు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు ఏర్పాటు చేసింది. గతంలో స్టాక్ పాయింట్లలో అక్రమాలకు అలవాటుపడ్డ కొందరు సిబ్బంది ఈ యంత్రాలను వినియోగించకుండా పక్కన పడేశారు. డీలర్ల నుంచి ఫిర్యాదులు అందుతుండడంతో ఇకపై స్టాక్పాయింట్లలో ఈ–వేయింగ్ యంత్రాల వినియోగాన్ని అధికారులు తప్పనిసరి చేశారు. - శ్రీకాకుళం జిల్లాలో 18, విజయనగరంలో 15, విశాఖపట్నంలో 30, తూర్పు గోదావరిలో 21, పశ్చిమ గోదావరిలో 14, కృష్ణాలో 17, గుంటూరులో 20, ప్రకాశంలో 19, నెల్లూరులో 15, చిత్తూరులో 28, వైఎస్సార్ కడపలో 19, అనంతపురంలో 24, కర్నూలు జిల్లాలో 17 మండల స్థాయి స్టాక్ పాయింట్లు ఉన్నాయి. - 257 స్టాక్ పాయింట్ల నుంచి 29 వేల రేషన్ దుకాణాలకు ప్రతినెలా 2.60 లక్షల టన్నుల బియ్యాన్ని తరలిస్తున్నారు. ఇందులో క్వింటాల్‌కు 1–2 కిలోల చొప్పున బియ్యం తగ్గుతున్నట్లు ఆరోపణలున్నాయి. - స్టాక్ పాయింట్లలో పనిచేసే కొందరు సిబ్బంది మిల్లర్లతో కుమ్మక్కై బియ్యాన్ని అక్రమంగా నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. - ఇకపై స్టాక్ పాయింట్లలో తప్పనిసరిగా ఈ–వేయింగ్ మిషన్ల ద్వారా బియ్యం తూకం వేసి, డీలర్లకు ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. - తూకాల్లో మోసాలకు తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నుంచి లబ్ధిదారులకు 5, 10, 15, 20 కిలోల సంచుల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. - ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. - ఏప్రిల్ నుంచి జిల్లాకు ఒక నియోజకవర్గం చొప్పున ఈ విధానాన్ని అమలు చేసి, ప్రతినెలా కొన్ని చొప్పున ఆగస్టు నాటికి 175 నియోజకవర్గాల్లో అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. -
అంతొస్తోందిగా.. ఎంతిస్తావు.?
‘కంగ్రాట్స్ బాబు.. విదేశీ విద్యానిధి పథకానికి ఎంపికయ్యావు. రూ.20 లక్షలొస్తాయి. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకేసారి ఇంత డబ్బు వస్తోంది కదా? మరి నాకెంత ఇస్తావ్? ఓసారి ఆలోచించి నా వాటా తేల్చేయ్’ – లబ్ధిదారునితో ఖమ్మం జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలోని ఓ అధికారి అన్న మాటలివి. సాక్షి, హైదరాబాద్ : విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కలను రాష్ట్ర ప్రభుత్వం విద్యానిధి పథకంతో సాకారం చేస్తోంది. ఏటా 1,000 మందికి అవకాశం కల్పిస్తోంది. ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఆ డబ్బు తిరిగి చెల్లించాల్సిన పనిలేదు. 2015–16 వరకు ఎస్సీ, ఎస్టీలకే పథకం అమలవగా తర్వాత బీసీ, ఈబీసీ, మైనారిటీలకు అందుబాటులోకి తెచ్చారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం.. బీసీ, ఈబీసీలకు మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి, మైనారిటీలకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ విద్యానిధి పేరుతో పథకాలు అమలు చేస్తున్నారు. ఆయా సంక్షేమ శాఖల వారీగా పథకాలు అమలవు తున్నాయి. విద్యార్థుల ఎంపిక రాష్ట్ర కార్యాలయాల్లో ఉన్నతాధి కారుల సమక్షంలో పక్కాగా జరిగినా.. నిధులు మాత్రం జిల్లా స్థాయి నుంచి ఇస్తున్నారు. ఈ తంతే విద్యార్థులకు గుదిబండగా మారుతోంది. వాటా ఇవ్వందే నిధులు ఇవ్వమంటూ కొందరు సంక్షేమ శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది కాలయాపన చేస్తున్నారు. విధిలేని పరిస్థితిలో వారు అడిగిన మొత్తానికి ఒప్పుకోవాల్సి వస్తోంది. ఎంపిక ఇలా.. పంపిణీ అలా.. విదేశాల్లో పీజీ చేయాలనుకున్న విద్యార్థి తొలుత విద్యానిధి పథకం కింద ఈ–పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత నిర్దేశిత తేదీల్లో రాష్ట్ర కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ చేసి అర్హత నిర్ధారిస్తారు. సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, శాఖ సంచాలకులు, సంయుక్త సంచాలకుల సమక్షంలో ప్రక్రియ పక్కాగా జరుగుతుంది. అనంతరం అర్హుల పేర్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. అర్హత సాధించిన విద్యార్ధి నిర్దేశిత వర్సిటీలో ప్రవేశం పొందిన తర్వాత సంబంధిత జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయం నుంచి తనిఖీ అధికారులు విద్యార్థి వాస్తవ పరిస్థితిని సమీక్షిస్తారు. మరోమారు ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. అనంతరం విదేశీ వర్సిటీలో ప్రవేశ పత్రాలు, మార్కుల మెమోల ఆధారంగా ఆర్థిక సాయం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉత్తీర్ణులయ్యాక తొలి విడత రూ.10 లక్షలు, రెండో సంవత్సరంలో సెమిస్టర్ పరీక్షల సమయంలో మిగతా రూ.10 లక్షలు చెల్లిస్తారు. 10 శాతం ఇచ్చుకోవాల్సిందే! ఎలాంటి పూచీకత్తు లేకుండా అర్హత, ప్రతిభ ఆధారంగా విద్యానిధి పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అధికారులు.. వాటాలు ఆర్జిస్తున్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన సమయంలోనే విద్యార్ధి కుటుంబ సభ్యులతో బేరం మాట్లాడుకుంటున్నారు. 5 నుంచి 10 శాతం డిమాండ్ చేస్తూ రేటు ఫిక్స్ చేస్తున్నారు. తొలి, రెండో విడత చెల్లింపుల సమయంలో సొమ్ము అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కమీషన్ ఇస్తేనే నిధుల జమకు మార్గం సుగమమవుతుంది. లేదంటే ఫైలుకు కొర్రీలేస్తూ నిధుల విడుదలలో జాప్యం చేస్తారు. ఇలా ఏటా రూ.10 కోట్ల వరకు కమీషన్ల రూపంలో లబ్ధిదారులు నష్టపోతున్నారు. -
ఆన్లైన్ ప‘రేషన్’
తిరుమలాయపాలెం : రేషన్ దుకాణాల్లో ఆన్లైన్లో ఈ పాస్ విధానంతో సరుకులు ఇచ్చే ఇంటర్నెట్ సౌకర్యం సరిగాలేకపోవడం, డీలర్లకు ఆన్లైన్ నమోదులో సరైన అవగాహన లేని ఫలితంగా కార్డుదారులను ఇబ్బందులకు గురిచేస్తుంది. రేషన్ కార్డు దారుల వేలిముద్ర ఆన్లైన్లో నమోద యితేనే బియ్యం ఇవ్వాలనే నిబంధన ఉంది. వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీలు రోజులతరబడి రేషన్ షాపుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలాయపాలెం మండలంలో 28 పంచాయతీల పరిధిలో 38 రేషన్ షాపులు ఉన్నాయి. ఆయా షాపుల పరిధిలో 19302 రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ అక్రమాలను నిరోధించేందుకు ఈపాస్ విధానాన్ని చేపట్టి రేషన్ వివరాలను ప్రజల ముంగిట్లో ఉంచేందుకు ఈ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఆలైన్ వ్యవస్థను నడి పించేందుకు ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఈ విధానాన్ని పర్యవేక్షిస్తున్న కంపెనీ ఆయా గ్రామాలలో సరైన ఇంటర్నెట్ సౌకర్యం ఉందా! లేదా? అనే విషయాన్ని తెలుసుకోకుండానే మిషన్లను అందజేసింది. రేషన్ డీలర్లకు సరైన శిక్షణ ఇవ్వకుండానే మిషన్లు అందజేసి ఈ పాస్ విధానాన్ని ప్రవేశ పెట్టారు. సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు మిషన్లను పర్యవేక్షిస్తున్న సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం లేదని రేషన్ డీలర్లు వాపోతున్నారు. దీంతో ఆయా గ్రామాలలో మిషన్లు పనిచేయక రేషన్ కార్డు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీడీఎస్ విధానం ద్వారా రేషన్ బియ్యం తీసుకోకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోతాయనే భయంతో కార్డు దారులు ఈ విధానంలో నమోదు చేయించుకుని బియ్యం తీసుకునేందుకు రేషన్ షాపులకు వస్తున్నారు. ఈ పాస్ మిషన్లలో కొందరు కార్డుదారుల వేలిముద్రలు పడడంలేదు. దీనిపై అధికారులు కూడా స్పష్టత ఇవ్వడంలేదు. అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. -
తేలని లెక్కలు
అధికారులు, డీలర్ల మధ్య కుదరని పొంతన ఆగిన కిరోసిన్ సరఫరా గడువున్నది రెండు రోజులే... 6.85లక్షల మందికి ఇబ్బందులు విజయనగరం కంటోన్మెంట్: అధికారుల ధీమా, డీలర్ల నిర్లక్ష్యంతో జిల్లాలోని 6.85 లక్షల వినియోగదారులకు కిరోసిన్ పంపిణీ నిలిచిపోయింది. ప్రతీ నెలా జిల్లాకు 12,48,000లీటర్ల నీలి కిరోసిన్ పంపిణీ అవుతున్నది. ఈ-పాస్ ద్వారా కాకుండా మామూలుగా ఇవ్వడం వల్ల గత నెల జిల్లాలోని అన్ని డిపోల్లో 77,451లీటర్ల కిరోసిన్ మాత్రమే మిగిలింది. ఇది డీలర్ల లెక్క. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,85,649 లీటర్లు మిగిలి ఉండాలి. అదే ఉద్దేశంతో దానిని కలుపుకుని తాజాగా 9,84,900 లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేశారు. ఇది ఎలా సరిపోతుందని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ పాస్ ద్వారా కిరోసిన్ సరఫరా కాకపోయినా... గత నెల 20, 21 తేదీల్లో కిరోసిన్ పంపిణీ చేశారనీ, 22వ తేదీకి క్లోజ్ చేశారనీ చెప్పారు. ఈ కొద్ది రోజుల్లో కిరోసిన్ ఈ పాస్ ద్వారా కిరోసిన్‌ను ఎలా పంపిణీ చేస్తామనీ డీలర్లు ప్రశ్నిస్తున్నారు. గతేడాది మార్చి నుంచి ఈ పాస్ విధానం మొదలైంది. కానీ కిరోసిన్ మాత్రం మామూలుగానే అందజేస్తున్నారు. ఇది అధికారులకు తెలుసు. రెండు నెలల క్రితం ఈ పాస్‌లోనే కిరోసిన్ ఇవ్వాలని జేసీ శ్రీకేశ్ బి లఠ్కర్, డీఎస్ఓ నాగేశ్వరరావు రేషన్ డీలర్లకు ఆదేశించారు. ఎప్పుడూ చెప్పేదే కదా అని డీలర్లు పట్టించుకోలేదు. కొంత మంది ప్రారంభంలో ఈపాస్ ద్వారా ఇవ్వడం ప్రారంభించినా ఆలస్యమవుతున్నదనే కారణంతో మాన్యువల్ పద్ధతిలోనే ఇచ్చేశారు. ఈ నెల ఈ పాస్‌లో ఎంత పంపిణీ అయిందో చూసుకుని ఆ మేరకే కిరోసిన్ కేటాయించారు. దీంతో క్లోజింగ్ బ్యాలెన్స్‌లో తేడా వచ్చింది. అధికారుల లెక్కలతో అయితే తాము సరఫరా చేయలేమని డీలర్లు తేల్చి చెప్పేశారు. దీనివల్ల కిరోసిన్ కేటాయించి దాదాపు 15 రోజులు దాటినా సరఫరా చేపట్టలేదు. ఈ నెల 18లోగా పంపిణీ పూర్తిచేయాలి. కానీ అలా అయ్యే అవకాశం కనిపించలేదు. దీనిపై మంగళవారం ఉదయం జేసీ శ్రీకేశ్ బి లఠ్కర్‌ను కలసి డీలర్లు వినతిపత్రాన్ని అందించారు. ఆయన సాయంత్రం కలువమన్నారని రేషన్ డీలర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సముద్రపు రామారావు చెప్పారు. సాయంత్రం డీఎస్‌ఓతో కలసి రావాలన్నారనీ, కానీ డీఎస్ఓ సాలూరు వెళ్లిపోవడంతో పంచాయతీ తేలలేదని తెలిసింది. -
తీరని ఈ-పాస్ కష్టాలు
శ్రీకాకుళం టౌన్: జిల్లాలో బయోమెట్రిక్ విధానం అమలుతో గత నెలలో 2.44 లక్షల కుటుంబాలకు సరుకులు అందకుండా పోయాయి. మంచంపై ఉన్న వారైనా వేలిముద్ర, ఐరిష్ లేకపోతే సరుకులను నిలిపివేశారు. దీనివల్ల అనేక కుటుంబాలకు తిండిగింజలు లేని పరిస్థితి దాపురించింది. సుమారు 13,400 కుటుంబాలు రేషన్ తీసుకునేందుకు రాలేని పరిస్థితి ఉన్నా సరుకులు ఇవ్వలేదు. వారికి సరుకులు ఇవ్వాలన్నా పౌరసరఫరాలశాఖ కమిషనర్ నుంచి ఉత్తర్వులు రావాల్సిఉందని జిల్లా యంత్రాంగం దాటవేస్తున్నారు. దీంతో నాలుగు నెలలుగా రేషన్ కష్టాలు పేదలకు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ-పాస్ అమలులో మూడో స్థానం ఈ-పాస్ అమలులో జిల్లా మూడో స్థానంలో ఉంది. ఇందులో అగ్రభాగం కృష్ణా జిల్లా. ఇక్కడ 82 శాతం కుటుంబాలకు ఈ-పాస్ ద్వారా సరుకులు నాలుగు నెలలుగా పంపిణీ చేస్తున్నారు. రెండో స్థానం అనంతపురం. ఇక్కడ కూడా 77 శాతం కార్డులకు మాత్రమే సరుకులు ఇస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాది మూడో స్థానం. ఇక్కడ కేవలం 70 శాతం కార్డులకు మాత్రమే గత నెలలో సరుకులు అందజేశారు. పౌరసరఫరాల శాఖ మొండి పట్టుదల ప్రజలకు అందినా అందక పోయినా పర్వాలేదు. మీరు మాత్రం ఈ-పాస్ విధానాన్నే అమలు చేయాలంటూ పౌరసరఫరాలశాఖ మొండిపట్టుదలతో ముందుకెళుతోంది. 30 శాంత కుటుంబాలకు అసలు నిత్యావసర సరుకులే అందకుండా పోతే ఇక ప్రభుత్వం చెబుతున్న ఆహార భద్రత అమలు ఎలా సాధ్యమని ప్రజలు నిలదీస్తున్నారు. రాష్ట్రంలో బయోమెట్రిక్ పద్ధతిలో ఈ-పాస్ విధానాన్ని పౌరసరఫరాల శాఖ ప్రవేశపెట్టింది. సెప్టెంబరు నుంచి క్షేత్రస్థాయిలో ఈ విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ఈ-పాస్ యంత్రాలను సరఫరా చేసింది. డీలర్లకు అవగహన కల్పించిన అధికారులు క్షేత్రస్థాయిలో అమలుకు సిద్ధపడ్డారు. జిల్లాలో ఈ విధానం అమలుకు 2001 మంది డీలర్లకు ఈ-పాస్ యంత్రాలను అందజేసిన ప్రభుత్వం బయోమెట్రిక్ కార్డుల అనుసంధానంతోనే సరుకులు ఇవ్వాలని నిర్ణయించింది. అప్పటినుంచి రేషన్ కార్డులు ఉన్నా సరుకులు అందడం లేదని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా 8.14 లక్షల తెలుపు రేషన్ కార్డులు జిల్లాలో జన్మభూమి రేషన్‌కార్డులతో కలిపి ప్రస్తుతం 8,14,406 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన బియ్యం, పంచదార, కందిపప్పు, కిరోసిన్, గోదుమలు, గోదుమ పిండి పౌరసరఫరాల దుకాణం ద్వారా పంపిణీ చేస్తున్నారు. అంత్యోదయ, అన్నపూర్ణ కార్డులకు సైతం సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఆహారభద్రత చట్టం అమలు పేరుతో కార్డుదారులందరికీ సరుకులు పంపిణీ చేసేవారు. తాజాగా ఈ-పాస్ విధానంతో ఈ చట్టానికి తూట్లు పడుతున్నాయి. ఈ-పాస్ విధానం అమలులో మొదట్లో ఎదురైన సమస్యలనుంచి గట్టెక్కిస్తామన్న ప్రభుత్వం కొత్తగా మరికొన్ని వేలిముద్ర మెషిన్లను సరఫరా చేసింది. వాటిని కొత్తసర్వరుకు అనుసంధానం చేసినా పాతపరిస్థితే కొనసాగుతోంది.