
సాక్షి, చెన్నై: తమిళనాడుకు వెళ్లాలంటే ఇక ఈ–పాస్ తప్పనిసరి అని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో మూడు రాష్ట్రాల వారికి మినహాయింపు కల్పించారు. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడు లోనూ క్రమంగా కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వెళుతున్న వారి రూపంలోనే కేసులు పెరుగుతున్నట్టు పరిశీలనలో తేలింది. దీంతో తమిళనాడులోకి వెళ్లాలంటే, ఈ–పాస్ పొందాల్సిందేనన్న ప్రకటనను ఆదివారం ఆరోగ్యశాఖ చేసింది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరిల నుంచి వచ్చేవారికి మాత్రం ఈ–పాస్ నుంచి మినహాయింపు కల్పించింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఇక్కడకు నేరుగా వచ్చే వాళ్లు, ఇతర రాష్ట్రాల మీదుగా విదేశాల నుంచి తమిళనాడులోకి వెళ్లే వాళ్లు తప్పనిసరిగా ఈ–పాస్ పొందాల్సిందేనని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment