సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ అధికారులు ప్రతీరోజు ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిపే 3,560 రెగ్యులర్ బస్సులతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నెల 8 నుంచి 13 వరకు అదనపు బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ అధికారులు ప్రతీరోజు ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిపే 3,560 రెగ్యులర్ బస్సులతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నెల 8 నుంచి 13 వరకు అదనపు బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రయాణికులు ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేయించుకోవడంతో ఈ నెల 9 నుంచి 13 వరకు రెగ్యులర్ బస్సుల్లో సీట్లు సుమారు 90 శాతం భర్తీ అయ్యాయి. తెలంగాణ ప్రాంతాలకు కేవలం 20 శాతం రిజర్వ్ కాగా.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు రెగ్యులర్ బస్సుల సీట్లన్నీ ఫుల్ అయ్యాయి.