Additional buses
-
అందుబాటులోకి తొమ్మిది అమరావతి బస్సులు
సాక్షి, విజయవాడ : ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు అదనంగా మరో తొమ్మిది అమరావతి బస్సులను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ఈ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య పాల్గొన్నారు. -
11 నుంచి ఇంటర్ పరీక్షలు
144 కేంద్రాలు, 92,892 మంది విద్యార్థులు అన్ని ప్రాంతాలకు అదనపు బస్సులు తిరుపతి గాంధీరోడ్డు: ఇంటర్మీడియెట్ పరీక్షలకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈనెల 11 నుంచి 25 వరకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలుకు జిల్లాలోని 144 కేంద్రాల్లో 92,892 మంది పరీక్షలకు హాజరవుతున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్ఐవో నాగభూషణం తెలిపారు. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు అధికంగా ఉండడంతో అందుకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ, కేంద్రం వద్ద నిఘా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష సమయం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందన్నారు. విద్యార్థులు ఆయా కేంద్రాలకు నిర్ణీత సమ యం కంటే గంట ముందుగానే చేరుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలోని 20 గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మేరకు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ కోరారని తెలిపారు. ఎండలు ముదిరిపోవడంతో అన్ని పరీక్షా కేంద్రాల్లో మెడికల్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఒకేచోట అధిక కేంద్రాలు ఉంటే అదనంగా ఏఎన్ఎంలను నియమించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రశ్నపత్రాలు ఆయా పరిధిలోని పోలీసుస్టేషన్లలో భద్రపరిచారు. ఈ పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించినట్టు ఆర్ఐవో తెలిపారు. -
ఇంటర్ పరీక్షలకు రెడీ..
ఈ నెల 9 నుంచి 27 వరకు పరీక్షలు 188 కేంద్రాలు.. 1.41 లక్షల మంది విద్యార్థులు అన్ని ప్రాంతాల్లో అదనపు బస్సులు సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హైదరాబాద్ జిల్లా అధికారయంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 9 నుంచి 27 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతుండటంతో... ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసేందుకు ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ నిర్మల ఆదేశాలిచ్చారు. జిల్లాలో 1,41,581 మంది పరీక్షలకు హాజరవనుండగా...188 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగరంలోని సంజీవరెడ్డినగర్, మెహిదీపట్నం ,హిమాయత్‌నగర్, నారాయణగూడ, నల్లకుంట తదితర ప్రాంతాలలో పరీక్షా కేంద్రాలు అధికంగా ఉండటంతో.... అందుకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ, కేంద్రాల వద్ద నిఘా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు ఆయా కేంద్రాలకు నిర్ణీత సమయాని కంటె అరగంట ముందుగానే చేరుకునేందుకు వీలుగా తగిన సంఖ్యలో బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ కోరారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. కాగా ఎండలు ముదురుతుండటంతో అన్ని పరీక్షా కేంద్రాలలో మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఒకే చోట అధిక కేంద్రాలున్న ప్రాంతంలో అదనంగా ఏఎన్ఎమ్లను నియమించాలని భావిస్తున్నారు. -
శ్రీశైలానికి అదనపు బస్సులు
తాండూరు: ఆర్టీసీ అధికారులు పలు మార్గాల్లో అదనపు బస్సులు నడిపేందుకు నిర్ణయించారు. మరికొన్ని రూట్లో బస్సులను పునరుద్ధరించనున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి శ్రీశైలానికి మూడు అదనపు బస్సులను నడపనున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి శ్రీశైలానికి ఉదయం 6, 7గంటలకు బస్సులు నడుస్తున్నాయి. వీటికి అదనంగా ఉదయం 8గంటలకు మధ్యాహ్నం 12గంటలకు, 2గంటలకు బస్సులు శ్రీశైలానికి బయలుదేరుతాయి. రోడ్డు బాగా లేనందున తాండూరు నుంచి జహీరాబాద్‌కు బస్సును నెల రోజుల క్రితం అధికారులు నిలిపివేశారు. రోడ్డుకు మరమ్మతులు చేయడంలో ఇందూరు మీదుగా జహీరాబాద్‌కు బస్సును పునరుద్ధరించనున్నారు. ఈ బస్సు గురువారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. తాండూరు నుంచి రోంపల్లి, బంట్వారం, కల్కోడ,మర్పల్లి గ్రామాల మీదుగా సదాశివపేట్ వరకు ఉదయం 7.30గంటలకు, మధ్యాహ్నం 1.35గంటలకు బస్సు నడపనున్నారు. అదేవిధంగా తాండూరు నుంచి రోంపల్లి బంట్వారం, తోర్మామిడి, కోహీర్ గ్రామాల మీదుగా ఉదయం 8గంటలకు జహీరాబాద్‌కు మరో బస్సును నడపనున్నారు. ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పోలేపల్లి జాతర కోసం తాండూరు నుంచి ప్రత్యేక బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఆయా రూట్లో ప్రయాణీకులకు మెరుగైన సేవలందించేందుకు బస్సులను నడపనున్నట్టు తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ బుధవారం చెప్పారు. -
సంక్రాంతికి ఆర్టీసీ అదనపు బస్సులు
హైదరాబాద్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ అధికారులు ప్రతీరోజు ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిపే 3,560 రెగ్యులర్ బస్సులతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నెల 8 నుంచి 13 వరకు అదనపు బస్సులను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయాణికులు ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేయించుకోవడంతో ఈ నెల 9 నుంచి 13 వరకు రెగ్యులర్ బస్సుల్లో సీట్లు సుమారు 90 శాతం భర్తీ అయ్యాయి. తెలంగాణ ప్రాంతాలకు కేవలం 20 శాతం రిజర్వ్ కాగా.. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు రెగ్యులర్ బస్సుల సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. -
ఎన్ని సర్వీసులైనా నడుపుతాం:ఆర్టీసి ఎండి
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఎన్ని అదనపు బస్ సర్వీసులైనా నడుపుతామని ఆర్టీసీ ఎండీ పూర్ణ చంద్రరావు చెప్పారు. నిన్నటి వరకు 9, 251 అదనపు బస్సులు నడిపినట్లు తెలిపారు. ఈరోజు మరో 526 బస్సులు నడుపుతున్నామని చెప్పారు. రేపు 249 అదనపు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 320 ప్రైవేట్ బస్సులు సీజ్ అయిన నేపథ్యంలో తాము అదనపు బస్సులు నడుతున్నట్లు చెప్పారు. గత 3 రోజులుగా 12 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చినట్లు తెలిపారు.