
సంక్రాంతి పండుగకు అల్లుళ్లకు మర్యాదల్లో తాము తగ్గేదేలే అని చెబుతున్నారు ఉమ్మడి గోదావరి జిల్లా వాసులు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వందనపు వెంకటేశ్వరరావు దంపతులు తమ అల్లుడికి 452 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. అలాగే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కుక్కుల వెంకటేశ్వరరావు దంపతులు తమ అల్లుడికి 270 రకాల పిండి వంటలతో మెగా విందు ఏర్పాటు చేశారు. – మామిడికుదురు/జంగారెడ్డిగూడెం
120 రకాల వంటలతో కొత్త అల్లుడికి భోజనం!
పెళ్లి అయిన తర్వాత తొలిసారి సంక్రాంతికి వచ్చిన అల్లుడికి అత్తామామలు 120 రకాల వంటకాలతో భోజనం పెట్టి సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన నందిగామ భాస్కరరావు – సుజాత రెండో కుమార్తె మధుశ్రీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సుధాపల్లికి చెందిన కొనకళ్ల సందీప్‌తో వివాహం జరిగింది.

కొత్త దంపతులు సంక్రాంతి పండుగకు వైరా వచ్చారు. ఈ సందర్భంగా భాస్కరరావు దంపతులు తమ అల్లుడు, కుమార్తెకు వివిధ రకాల పిండివంటలు, ఇతర వంటకాలు కలిపి 120 రకాలతో భోజనం వడ్డించడం విశేషం.
చదవండి: వెళ్ళొస్తా సుజాతా.. సంక్రాంతి సిత్రాలు