
సాక్షి, హైదరబాద్: సార్వత్రిక ఎన్నికల దృశ్య సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రజలు తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున పోటెత్తారు. ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న దృశ్యా ఎంజీబీఎస్ నుంచి వివిధ ప్రాంతాలకు అదనపు బస్సులను ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు మంగళ, బుధ వారాల్లో ఫుల్ అయిపోయాయి. రైళ్లలో కూడా రద్దీ పెరిగింది. సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణికులు.. ఎంజీబీఎస్‌లో పడిగాపులు కాస్తున్నారు.
ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ రెచ్చిపోతున్నారు. టికెట్ల ధరలు మూడింతలు, నాలుగింతలు చేసేశారు. దీంతో ఓటు వేయాలని బయలుదేరిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా విజయవాడ రూట్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఛార్జీలు భారీగా పెంచారు. ప్రైవేటు ట్రావెల్స్‌లో కూడా చాలా రూట్లలో నాన్ ఏసీ బస్సులలో సీట్లు నిండిపోయాయి. ఏసీ సర్వీస్‌లో సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ టికెటు రెట్లు భారీగా ఉన్నాయి. మరోవైపు విమాన ధరలు కూడా ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ సర్వీస్ టికెట్ల రెట్లు గమనించినట్లయితే..
విశాఖ- రూ.3,200
విజయవాడ- రూ. 2,500
కాకినాడ- రూ. 2,000
గుంటూరు- రూ. 2,200
నెల్లూరు- రూ. 3,000 నుంచి 3,500
తిరుపతి- 2,200
కడప- 1,900
Comments
Please login to add a commentAdd a comment