కొత్త బస్సుల కోసం సీఎంకు ప్రతిపాదిస్తాం  | TS RTC Chairman Bajireddy Propose To CM KCR To Buy 2, 820 RTC Buses | Sakshi
Sakshi News home page

కొత్త బస్సుల కోసం సీఎంకు ప్రతిపాదిస్తాం 

Published Sun, Feb 20 2022 12:56 AM | Last Updated on Sun, Feb 20 2022 12:56 AM

TS RTC Chairman Bajireddy Propose To CM KCR To Buy 2, 820 RTC Buses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీకి కొత్త బస్సుల అవసరముందని, 2,820 బస్సులు కొనేందుకు సీఎంకు ప్రతిపాదించనున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ పేర్కొన్నారు. అలాగే మృతిచెందిన ఆర్టీసీ ఉద్యో గుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం ద్వారా సంస్థలో ఉద్యో గం కల్పించే అంశాన్ని కూడా అందులో ప్రస్తావిస్తామని, కారుణ్య నియామకాల కోసం 1,200 మంది ఎదురు చూస్తున్నారన్నారు. శనివారం బస్‌భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. సమ్మక్క–సారలమ్మ జాతరకు విస్తృతంగా ఏర్పాట్లు చేశామని, ఆశించినంత ఆదాయం రాలేదన్నారు. రిటైర్మెంట్‌ బెని ఫిట్లకు సంబంధించి రూ.500 కోట్లను ప్రభుత్వం నుంచి కోరనున్నట్లు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement