
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్ నుంచి నగరానికి చేరుకున్న వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తెలంగాణలోని ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసేందుకు తగిన విధంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.