
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, తూర్పు గోదావరి జిల్లా: సామర్లకోట పిఠాపురం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌బస్సు అదుపు తప్పి విద్యుత్ స్థంభాన్ని డీకొట్టిన ఘటన శనివారం చోటుచేసుకుంది. దీంతో దగ్గర్లోని పంట కాలువలోకి బస్సు దూసుకుపోయింది. శబరిమల నుంచి తిరుగువస్తున్న ఈ బస్సులో దాదాపు 40మంది ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఉన్న అయ్యప్ప భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వారి సొంత గ్రామం ప్రత్తిపాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment