ఓ ప్రక్క సీమాంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్నా..నిమ్మకు నీరెత్తుకుండా బస్సులను నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు ఆర్టీసీ జేఏసీ హెచ్చరికలు జారీ చేసింది.
అనంతపురం: ఓ ప్రక్క సీమాంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్నా..నిమ్మకు నీరెత్తుకుండా బస్సులను నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు ఆర్టీసీ జేఏసీ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని ప్రకటించినా.. ప్రైవేటు బస్సులను తిప్పుతుండటంతో మండిపడింది. బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ నడపరాదని జేఏసీ హెచ్చరికల నేపథ్యంలో.. బుధవారం నుంచి బస్సులను నిలిపివేస్తామని ప్రైవేటు బస్సుల యాజమాన్యాల సంఘాల నేత మునిరత్నం తెలిపారు.