తిరుగు ప్రయాణం కోసం 180 బస్సులు
Published Sun, Jan 15 2017 11:42 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
– ఏర్పాట్లు చేసిన ఆర్టీసీ
కర్నూలు(రాజ్‌విహార్): సంక్రాంతి పండుగ అనంతరం తిరుగు ప్రయాణం సందర్భంగా 180 ప్రత్యేక బస్సులు నడిపేందుకు రోడ్డు రవాణ సంస్థ చర్యలు చేపట్టింది. పండుగకు ముందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం 270 బస్సులను ఆర్టీసీ నడిపింది. తిరిగి వెళ్లే ప్రజల కోసం స్పెషల్ ఆపరేషన్స్‌కు కసరత్తు చేస్తోంది. ఇందులో ఆదివారం 105 బస్సులు నడపగా ఇందులో హైదరాబాద్‌కు 62, బెంగళూరుకు 32, విజయవాడకు 3, ఒంగోలుకు 1, చెన్నైకి 3, నెల్లూరుకు 1, తిరుపతికి మూడు బస్సులు పంపారు. సోమవారం ఈ రూట్లలో ట్రాఫిక్‌ను బట్టి మరో 75 బస్సులు తిప్పనున్నారు. అయితే మంగళ, బుధవారాల్లో కూడా ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు బస్సులు నడుపుతామని కర్నూలు బస్‌స్టేషన్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజరు (ఏటీఎం) ప్రసాద్ తెలిపారు.
Advertisement
Advertisement