కూకట్‌పల్లి ఆర్టీసీ డిపో నుంచి గోదావరి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ వి.మల్లయ్య శనివారం తెలిపారు.
మూసాపేట (హైదరాబాద్) : కూకట్‌పల్లి ఆర్టీసీ డిపో నుంచి గోదావరి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ వి.మల్లయ్య శనివారం తెలిపారు. ఈనెల 14 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు ప్రశాంత్‌నగర్‌లోని బస్ టెర్మినల్ నుంచి ఆదిలాబాద్ జిల్లా బాసరకు, నిజామాబాద్ జిల్లా పోచంపాడుకు గోదావరి పుష్కరాల ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, జగద్గిరిగుట్ట, బోరబండ, సనత్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ ప్రాంతవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. బాసర వెళ్లేందుకు పెద్దలకు రూ.260, పిల్లలకు రూ.130, పోచంపాడు వెళ్లేందుకు పెద్దలకు రూ.265, పిల్లలకు రూ.140ల టిక్కెట్లు ఉంటాయన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 7382818841ను సంప్రదించగలరు.