కరీంనగర్ : పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే గోదావరి పుష్కరాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇదే అదనుగా ఆర్టీసీ ప్రయాణికులపై చార్జీల కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పుష్కరాలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో చార్జీలను పెంచింది.
దీంతో పెరిగిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. కరీంనగర్ బస్టాండ్ ఎదుట బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో ఈ ధర్నా జరిగింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పలువురుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
పుష్కరాలకు ఆర్టీసీ చార్జీల వాత
Published Sun, Jul 12 2015 12:22 PM | Last Updated on Thu, May 24 2018 1:29 PM
Advertisement
Advertisement