పుష్కరాల కోసం 1150 బస్సులు
పనులను పరిశీలించిన మంత్రి
దామరచర్ల : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి వద్ద కృష్ణా పుష్కర పనులను తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. పుష్కర పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీనాక్షి అగస్తేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాగా కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రత్యేకంగా 1,150 ఆర్టీసీ బస్సులను నడుపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ రమణారావు తెలిపారు. పుష్కరాల కోసం కొత్తగా 2,500 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. పుష్కర యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.