![RTC SPECIAL BUSES FROM HYDERABAD TO ARUNACHAL FROM JULY 19th](/styles/webp/s3/article_images/2024/07/15/tsbus.jpg.webp?itok=bNk29PdW)
సాక్షి, హైదరాబాద్: గురుపౌర్ణమి సందర్భంగా భక్తు లు అరుణాచలంలో గిరిప్రదక్షిణకు ఆసక్తి చూపుతారు. గత కొన్నేళ్లుగా అక్కడికి వెళ్లే భక్తుల రద్దీ పెరుగుతోంది. దీంతో ఈసారి స్పెషల్ బస్సులు పెంచాలని సంస్థ నిర్ణయించింది.
ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర పట్టణాల నుంచి వీటిని నడపనుంది. ఈ నెల 21న గురుపౌర్ణమి కాగా, 19 నుంచి 22 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ వెల్లడించింది. అరుణాచలంతోపాటు కాణిపాకం, శ్రీపురం కూడా దర్శించుకునేలా ఈ ప్యాకేజీని ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment