అనంతపురం న్యూసిటీ : సంక్రాంతి పండుగ కోసం వివిధ ప్రాంతాల నుంచి అనంతకు వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు అనంతపురం నుంచి ప్రధాన నగరాలకు ప్రత్యేక బస్సులు తిప్పుతున్నట్లు అనంతపురం అర్టీసీ డీఎం బాలచంద్రప్ప శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు తిప్పుతున్నామన్నారు. ముందస్తుగా రిజర్వేషన్ సదుపాయం కల్పించామన్నారు.