
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ వేదికగా బుధవారం తలపడనుంది. ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు వెళ్లాలంటే లక్నోతో మ్యాచ్‌లో కమిన్స్ బృందం తప్పక గెలవాలి.
అయితే, వర్షం రూపంలో సన్‌రైజర్స్- లక్నో పోరుకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. నగరంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మ్యాచ్ గనుక రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది.
ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
ఇదిలా ఉంటే.. హోంగ్రౌండ్‌లో సన్‌రైజర్స్ మెరుపులను వీక్షించడానికి వచ్చే అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఆ ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు
ఈసీఐఎల్, ఎల్‌బీనగర్, కొండాపూర్, జీడిమెట్ల, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం,మియాపూర్,లక్డీకాపూల్, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్, జూబ్లీ బస్‌స్టేషన్, హకీంపేట్, మేడ్చల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, బీహెచ్‌ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ప్రత్యేక బస్సులను నడుపనున్నారు.
మెట్రోలో సైతం
అలాగే ప్రయాణికుల రద్దీ మేరకు వివిధ మార్గాల్లో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మధ్య ప్రయాణికుల డిమాండ్ మేరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.
చదవండి: సంజూ శాంసన్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ
The Risers are back to Hyderabad 🧡💪 pic.twitter.com/uecAotesSz
— SunRisers Hyderabad (@SunRisers) May 7, 2024