‘‘నాకసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. టీవీలోనే ఇలాంటి బ్యాటింగ్ చూశాం. కానీ ఇప్పుడిలా.. అస్సలు నమ్మలేకపోతున్నాం. ప్రతి బంతి బౌండరీ లేదంటే సిక్సర్.
వారి నైపుణ్యాలకు హ్యాట్సాఫ్. సిక్స్‌లు కొట్టేందుకు వాళ్లు పడిన శ్రమ ఇక్కడ కనిపిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో అసలు పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేసే ఛాన్స్ కూడా వాళ్లు మాకివ్వలేదు.
మొదటి బంతి నుంచే వారి దూకుడు కొనసాగగా.. మేము ఏ దశలోనూ అడ్డుకట్ట వేయలేకపోయాం. జట్టు ఓడిపోయినట్లయితే.. మనం తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు.
మేము కనీసం ఇంకో 40- 50 పరుగులు చేయాల్సింది. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోయిన తర్వాత అస్సలు కోలుకోలేకపోయాం. ఆయుశ్, నిక్కీ అద్భుతంగా బ్యాటింగ్ చేసినందు వల్లే 166 టార్గెట్ విధించగలిగాం’’ అని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు.
ఒకవేళ తాము 240 పరుగులు చేసినా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ లక్ష్యాన్ని ఛేదించేదేనేమో అంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా ఐపీఎల్-2024 తాజా మ్యాచ్‌లో లక్నో సన్‌రైజర్స్‌తో తలపడింది.
టాపార్డర్ పూర్తిగా విఫలం
ఉప్పల్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో తొలుత బ్యాటింగ్ చేసి.. పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడింది. ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్(29) సహా టాపార్డర్‌లో క్వింటన్ డికాక్(2), మార్కస్ స్టొయినిస్(3) పూర్తిగా విఫలమయ్యారు.
నాలుగో నంబర్ బ్యాటర్ కృనాల్ పాండ్యా(21 బంతుల్లో 24) నిలదొక్కునే ప్రయత్నం చేసినా రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అతడి పప్పులు ఉడకనివ్వలేదు. దీంతో కష్టాల్లో పడిన లక్నోను నికోలస్ పూరన్(26 బంతుల్లో 48), ఆయుశ్ బదోని(30 బంతుల్లో 55) ఆదుకున్నారు.
పరుగుల సునామీ
వీరిద్దరి భాగస్వామ్యం కారణంగానే లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగలిగింది. అయితే, లక్ష్య ఛేదనలో ఊహించని విధంగా పరుగుల సునామీ సృష్టించారు సన్‌రైజర్స్ ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు- 75 పరుగులు), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు- 89 రన్స్).
కొడితే బౌండరీ లేదంటే సిక్స్ అన్నట్లుగా సాగింది వీళ్లిద్దరి విధ్వంసం. అభిషేక్ 267.86, హెడ్ 296.67 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేయడంతో.. దెబ్బకు 9.4 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది సన్‌రైజర్స్.
పాపం రాహుల్
లక్నోను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక ఈ పరుగుల విధ్వంసానికి సాక్షిగా నిలిచిన వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓటమి అనంతరం పైవిధంగా స్పందించాడు. కాగా ఓటమి నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకా రాహుల్‌పై సీరియస్ అయ్యాడు.
చదవండి: SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
WHAT. A. CHASE 🧡
A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare!
Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024
Comments
Please login to add a commentAdd a comment