ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (మే 8) జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ నాలుగులో.. లక్నో ఆరో స్థానంలో ఉన్నాయి. నగరంలో నిన్న రాత్రి అతి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో నేటి మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనుమానాలు ఉండేవి. అయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే వరుణుడి నుంచి మ్యాచ్‌కు ఎలాంటి ముప్పు లేదని తెలుస్తుంది.
తుది జట్ల విషయానికొస్తే.. ఇరు జట్లు పలు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. లక్నో జట్టుకు సంబంధించి డికాక్ తిరిగి జట్టులోకి రాగా.. మొహిసిన్ ఖాన్ ఔటయ్యాడు. సన్‌రైజర్స్ తరఫున లంక యువ స్పిన్నర్ విజయ్‌కాంత్ వియాస్‌కాంత్ అరంగేట్రం చేయనుండగా.. మయాంక్ అగర్వాల్ స్థానంలో సన్వీర్ సింగ్ జట్టులోకి వచ్చాడు.
హెడ్ టు హెడ్ రికార్డ్స్ విషయానికొస్తే.. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. అన్ని సందర్భాల్లో లక్నోనే విజయం సాధించింది.
తుది జట్లు..
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్‌కీపర్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రవిస్ హెడ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, విజయకాంత్ వియాస్కాంత్, టి నటరాజన్
Comments
Please login to add a commentAdd a comment