పిక్నిక్‌లకు ఆర్టీసీ స్పెషల్స్‌ | Special Buses For Tourist Destinations in Visakhapatnam District | Sakshi
Sakshi News home page

పిక్నిక్‌లకు ఆర్టీసీ స్పెషల్స్‌

Published Sun, Nov 14 2021 10:32 AM | Last Updated on Sun, Nov 14 2021 10:39 AM

Special Buses For Tourist Destinations in Visakhapatnam District - Sakshi

సాక్షి, డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): కార్తీక మాసం వనవిహారాలకు అనువైన మాసం. అందునా.. పర్యాటకుల స్వర్గధామంగా పేరెన్నిక గన్న విశాఖ. ఈ సదవకాశాన్ని సది్వనియోగం చేసుకునేందుకు ఏపీఎస్‌ఆరీ్టసీ చర్యలు చేపట్టింది. పర్యాటకప్రాంతాలకు వారాంతాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోంది.  

పంచారామాల సందర్శన 
పవిత్రమైన ఈ మాసంలో శైవక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఒకేరోజు పంచారామాల సందర్శనకు ఏర్పాట్లు చేసింది.  

సందర్శన ప్రాంతాలు 
అమరావతిలోని అమరేశ్వరాలయం, భీమవరంలోని సోమేశ్వరుడు, పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వరస్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి ఆలయం, సామర్లకోటలోని కుమార రామలింగేశ్వరస్వామి ఆలయం 

ప్రయాణ తేదీలు 
ఈ నెల 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు విశా ఖ ద్వారకా బస్‌స్టేషన్‌ నుంచి బస్సులు బయల్దేరనున్నాయి.  

బస్‌చార్జీ : 
సూపర్‌ లగ్జరీ ప్రయాణ చార్జీ పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1,700 
అల్ట్రా డీలక్స్‌ ప్రయాణ చార్జీలు పెద్దలకు రూ.1,900, పిల్లలకు రూ.1,600  

వనవిహారాల కోసం.. 
పిక్నిక్‌లకు వెళ్లే పర్యాటకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. లంబసింగికి శని, ఆదివారాల్లో తెల్లవారుజామున 3 గంటలకు ద్వారకాబస్‌స్టేషన్‌ నుంచి బస్సులు బయల్దేరతాయి.  

సందర్శన ప్రాంతాలు 
లంబసింగి, తాజంగి డ్యామ్, కొత్తపల్లి వాటర్‌ఫాల్స్, మోదమాంబ గుడి, కాఫీ ప్లాంటేషన్‌  

చార్జీలు 
అల్ట్రా డీలక్స్‌ ప్రయాణ చార్జీలు పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.500  
ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ చార్జీలు పెద్దలకు రూ.600, పిల్లలకు రూ.450  

అరకు టూర్‌  
శని, ఆదివారాల్లో ఉదయం 6 గంటలకు ద్వారకాబస్‌స్టేషన్‌ నుంచి బస్సులు బయలుదేరుతాయి.  

సందర్శన ప్రాంతాలు 
డముకు వ్యూ పాయింట్, గాలికొండ వ్యూ పాయింట్, చాపరాయి, పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్‌ మ్యూజియం 

చార్జీలు 
అల్ట్రా డీలక్స్‌ ప్రయాణ చార్జీ పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.500 
ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు పెద్దలకు రూ.600, పిల్లలకు రూ.450 

ధారమట్టం  
ఈ బస్సులు శని, ఆదివారాల్లో ఉదయం 7 గంటలకు ద్వారకాబస్‌స్టేషన్‌ నుంచి బయలుదేరుతాయి.  

దర్శనప్రాంతాలు 
శివాలయం, ధారమట్టం వాటర్‌ఫాల్స్, అల్లూరి సీతారామరాజు మ్యూజియం, బొజ్జనకొండ(అనకాపల్లి) 
చార్జీలు : అల్ట్రా డీలక్స్‌ ప్రయాణ చార్జీలు పెద్దలకు రూ.600, పిల్లలకు రూ.500 
ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.400  

ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌కు అవకాశం 
పర్యాటకులు, భక్తులు www.apsrtconline.in ద్వారా ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. రిజర్వేషన్‌ కౌంటర్‌ వద్ద  టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 99592 25602, 73829 14183, 99592 21199 నంబర్లలో సంప్రదించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement