కృష్ణా పుష్కరాలకు ‘టూరిజం’ ప్రత్యేక బస్సులు | Krishna puskaralaku 'Tourism' special buses | Sakshi
Sakshi News home page

కృష్ణా పుష్కరాలకు ‘టూరిజం’ ప్రత్యేక బస్సులు

Published Wed, Aug 10 2016 12:23 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

Krishna puskaralaku 'Tourism' special buses

హన్మకొండ :  కృష్ణా పుష్కరాలకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రత్యేక బస్సులు నడుపనుందని ఆ సంస్థ జిల్లా మేనేజర్‌ కత్తి నాథన్‌ చెప్పారు. మంగళవారం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
 
36 సీట్ల నాన్‌ ఏసీ హైటెక్‌ బస్సు ప్రతి రోజు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరుతుందన్నారు. 
ఈ ప్రత్యేక బస్సు మహబూబ్‌నగర్‌ జిల్లా బీచ్‌పల్లి పుష్కర ఘాట్, ప్రసిద్ధ శక్తి పీఠం జోగులాంబ దేవీ ఆలయాన్ని వెళ్లి, మరుసటి రోజు ఉదయం 4 గంటలకు హన్మకొండకు చేరుతుందన్నారు. ఈ నెల 12 నుంచి 23 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు. జిల్లాలోని పర్యాటకులు, భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చార్జీలు పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200గా నిర్ణయించామన్నారు. సమావేశంలో హరిత కాకతీయ హోటల్‌ యూనిట్‌ మేనేజర్‌ సురేష్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement