![మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు](/styles/webp/s3/article_images/2017/09/3/41452927210_625x300_1.jpg.webp?itok=V38M9uwl)
మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
వరంగల్: వరంగల్ జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క-సారక్క జాతరకు 4 వేల ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు మేడారం వద్ద 50 ఎకరాలలో బస్సు షెల్టర్‌ను ఏర్పాటు చేసినట్లు వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ చెప్పారు. సమ్మక్క-సారలమ్మ తల్లులకు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో మేడారం భక్తజన సంద్రమైంది.