సాక్షి, అమరావతి: కార్తీక మాసంలో రాష్ట్రంలో ఐదు పంచారామాలైన పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతికి అన్ని జిల్లాల నుంచి 1,750 బస్సులను తిప్పేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. భక్తులకు అసౌకర్యం లేకుండా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల రీజనల్ మేనేజర్లను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఒక్కరోజే పంచారామాలు దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. దీనికి అనుగుణంగా ఆర్టీసీ రవాణా సదుపాయం కల్పిస్తోంది. మొదటి సోమవారం ఆర్టీసీ తొమ్మిది జిల్లాల నుంచి పంచారామాలకు, నాలుగు జిల్లాల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడిపింది.
మొదటివారం 106 సర్వీసులు
► పంచారామాలకు మొదటివారం తొమ్మిది జిల్లాల నుంచి 106 ప్రత్యేక సర్వీసులు, శ్రీశైలం, కోటప్పకొండకు కర్నూలు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 16 బస్సులు నడిపారు.
► దూరాన్ని బట్టి ఆదివారం అర్ధరాత్రి నుంచి బస్సులు బయలుదేరి సోమవారం రాత్రికల్లా పంచారామాల్లో దర్శనాలు చేసుకుని తిరుగు పయనమయ్యేందుకు వీలుగా శీఘ్ర దర్శనాలు చేయించనున్నారు.
పంచారామాలకు 1,750 ప్రత్యేక బస్సులు
Published Thu, Nov 19 2020 4:28 AM | Last Updated on Thu, Nov 19 2020 4:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment