సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహణకు రూ.2.5 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర పర్యాటక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
స్వదేశీ దర్శన్ పథకం కింద కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గిరిజన సర్క్యూట్ల అభివృద్ధిలో భాగంగా 2016–17 లోనే రూ.80 కోట్ల వ్యయంతో ములుగు, లక్నవరం, మేడవరం, తాడ్వాయి, దామరవి, మల్లూర్, బొగత జలపాతాల సమగ్ర అభివృద్ధి చేపట్టిందని వెల్లడించారు. ఇందులో భాగంగానే మేడారంలో అతిథిగృహం, ఓపెన్ ఆడిటోరియం, పర్యాట కుల విడిదిగృహాలు, తాగునీటి సరఫరా, సో లార్ లైట్లు తదితర సౌకర్యాలను కల్పించిం దని వివరించారు. గిరిజన ప్రజల సంస్కృతి సంప్రదాయాలను కేంద్ర ప్రభుత్వం విశేషంగా గౌరవిస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment