హైదరాబాద్, సాక్షి: సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముత్యాలమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన బాధ్యులను కఠినంగా శిక్షించాలని పలు హిందూ సంఘాలు డిమండ్ చేస్తున్నాయి. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోలనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.
విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. విగ్రహ ధ్వంసంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ధానికులతో మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘హిందూ దేవాలయలు లక్ష్యంగా దాడి చేస్తున్నారు. అమ్మవారి విగ్రహాన్నిధ్వంసం చేసి గేట్లు విరగ్గొట్టారు. దేవాలయాలపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దేవాలయాలకు పటిష్ట భద్రత కల్పించి రక్షణ కల్పించాలి. మత కలహాలు జరగకుండా అడ్డుకోవాలి’’ అని అన్నారు.
కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ పరిశీస్తున్నారు.
చదవండి: యూఎస్‌లో తెలంగాణ విద్యార్థి హత్య.. నిందితుడికి 60 ఏళ్ల జైలు శిక్ష
Comments
Please login to add a commentAdd a comment