
విజయవాడ నుంచి 250 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ
విజయవాడ : సంక్రాంతి పండగ కోసం సొంత ఊళ్లకు వెళ్లి.... మళ్లీ గమ్యస్థానాలకు తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు శనివారం విజయవాడలో ఓ ప్రకటనలో వెల్లడించారు. అందుకోసం విజయవాడ నగరం నుంచి 250 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక బస్సులతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉన్నతాధికారులు వివరించారు.