Pongal festival
-
Happy Pongal 2024: సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన సినీ తారలు (ఫోటోలు)
-
Pongal Fight: పదిసార్లు పోటీపడ్డారు.. 11వ సారి విజయమెవరిదో?
చిరంజీవి-బాలయ్యల మధ్య సినిమాల పోరు ఈ నాటిది కాదు. దశాబ్దాలుగా అది కొనసాగుతూనే ఉంది. ప్రత్యేకించి సంక్రాంతి పండగ సందర్భంగా ఇద్దరి సినిమాలూ పోటీ పడటం కూడా ఇపుడే మొదలు కాలేదు. మూడున్నర దశాబ్ధాలుగా ఇద్దరి సినిమాలు కొదమ సింహాల్లా తలపడుతూనే ఉన్నాయి. ఈ ప్రస్థానంలో ఇద్దరికీ బ్లాక్ బస్టర్లున్నాయి. ఇద్దరికీ కొన్ని డిజాస్టర్లూ ఉన్నాయి. అయితే ఆరోగ్యకరమైన పోటీ మాత్రం సాగుతూనే ఉంది. యుద్ధం సినిమాల మధ్యనే తప్ప నటుల మధ్య కాదు. అయితే 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి పండగ సమయంలో హోరా హోరీ తలపడే రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడం మాత్రం ఇదే మొదటి సారి. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు రెండింటినీ కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే నిర్మించడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండక్కి పెద్ద ప్రాధాన్యతే ఉంది. రైతుల పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి రైతుల దగ్గర నాలుగు డబ్బులు ఆడతాయి. సకల వ్యాపారాలూ కళకళలాడుతూ ఉంటాయి. అందులో సినిమా వ్యాపారానికి ఇది అసలు సిసలు సీజన్ అనే చెప్పాలి. అందుకే అగ్రనటులు తమ ప్రతిష్ఠాత్మక సినిమాలను సంక్రాంతి సందర్భంగానే విడుదల చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. నందమూరి బాలయ్య, చిరంజీవి ఇద్దరూ కూడా ఊర మాస్ హీరోలు. ఈ ఇద్దరి సినిమాలు విడుదలైతే మాస్ జనాల్లో పూనకాలు వచ్చేస్తాయి. థియేటర్లు కళకళలాడిపోతాయి. అందులోనూ సంక్రాంతి సీజన్లో ఈ ఇద్దరి సినిమాలూ విడుదలైతే మాత్రం అటు అభిమానులకూ ఇటు ఫ్యాన్స్‌కూ సంక్రాంతిని మించిన పెద్ద పండగే అవుతుంది. ► 1987 సంక్రాంతిలో బాలయ్య- చిరంజీవిల సినిమాలు మొదటిసారి తలపడ్డాయి. జనవరి 9న చిరంజీవి- కోదండ రామిరెడ్డి కాంబినేషన్లో రూపొందిన 'దొంగ మొగుడు' విడుదలైంది. మొదటి రోజు మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అయిదు రోజుల తర్వాత జనవరి 14న బాలయ్య కోదండరామిరెడ్డిల కాంబినేషన్లో రూపొందిన 'భార్గవ రాముడు' సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకున్నా దొంగమొగుడు సినిమాకి కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉందని సినీ రంగ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ► ఆ మరుసటి ఏడాది అంటే 1988లో జనవరి 14న చిరంజీవి కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందిన 'మంచి దొంగ' విడుదలైంది. ఆ మర్నాడే జనవరి 15న బాలయ్య ముత్యాల సుబ్బయ్యల సినిమా 'ఇన్ స్పెక్టర్ ప్రతాప్' విడుదల అయ్యింది. వీటిలో మంచి దొంగ ఏవరేజ్ హిట్ కాగా ఇన్ స్పెక్టర్ ప్రతాప్ హిట్ టాక్ తెచ్చుకుంది. ► 1989 సంక్రాంతి బరిలో జనవరి 14న చిరంజీవి నటించిన 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' సినిమా విడుదలైంది. రిలీజ్ రోజునే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మరుసటి రోజున జనవరి 15న బాలయ్య నటించిన భలేదొంగ సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కలెక్షన్ల వర్షం కురిసింది. ► ఆ తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఇద్దరి సినిమాలూ సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యాయి. ముందుగా 1997 జనవరి 4న 'హిట్లర్' సినిమా రిలీజ్ అయ్యింది. బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆరు రోజుల తర్వాత 1997 జనవరి 10న బాలయ్య సినిమా 'పెద్దన్నయ్య' విడులైంది.ఈ సినిమా కూడా హిట్ టాక్‌తో దూసుకుపోయింది. ► మరో రెండేళ్ల తర్వాత 1999లో జనవరి 13న బాలయ్య నటించిన 'సమరసింహారెడ్డి' సినిమా బ్లాక్ బస్టర్ గా మెరిసింది. దీనికి ఇంచుమించు రెండు వారాలకు ముందే జనవరి 1న చిరంజీవి నటించిన 'స్నేహం కోసం' రిలీజ్ అయ్య ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ► రెండు వేల సంవత్సరంలో జనవరి 7న చిరంజీవి సినిమా 'అన్నయ్య' విడుదలైంది. జస్ట్ ఓకే టాక్ తెచ్చుకుంది. వారం తర్వాత జనవరి 14న బాలయ్య నటించిన 'వంశోద్ధారకుడు' రిలీజ్ అయ్యింది. ఇది ఫ్లాప్ అయ్యింది. ► 2001 జనవరి 11న బాలయ్య సినిమా 'నరసింహనాయుడు' విడుదలై భారీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదే రోజున చిరంజీవి నటించిన 'మృగరాజు' విడుదలైంది. ఇది చిరంజీవి కెరీర్లోనే డిజాస్టర్ గా నిలిచింది. ► మళ్లీ మూడేళ్ల తర్వాత బాలయ్య, చిరంజీవి సంక్రాంతి బరిలో పోటీ పడ్డారు. 2004 జనవరి 14న బాలయ్య నటించిన 'లక్ష్మీ నరసింహ' విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ మర్నాడు జనవరి 15న చిరంజీవి నటించిన 'అంజి' సినిమా విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ► 2004 తర్వాత మళ్లీ ఇద్దరూ 2017 సంక్రాంతిలో తలపడ్డారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడంతో ఇంచుమించు తొమ్మిదేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. ► 2017లో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌ను సంక్రాంతి సీజన్లోనే ప్రారంభించారు. 2017 జనవరి 11న చిరంజీవి వినాయక్‌ల కాంబినేషన్లో చిరంజీవి 150వ సినిమాగా విడుదలైన 'ఖైదీ నంబర్ 150' సూపర్ హిట్ అయ్యింది. జనవరి 12న బాలయ్య నటించిన చారిత్రక సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' విడుదలై పెద్ద హిట్ కొట్టింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ సంక్రాంతి సీజన్లో కలబడలేదు. ఆరేళ్ల తర్వాత ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెండితెరను అలరించనున్నారు. ఇక బాలయ్య మాంచి మాస్ క్యారెక్టర్ తో వీర సింహారెడ్డిగా కనపడనున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పోరులో ఎవరు పెద్ద వీరుడిగా అవతరిస్తారన్నది తేలాల్సి ఉంది. చదవండి: బాక్సులు బద్ధలైపోతాయని రవితేజ వార్నింగ్.. వాల్తేరు వీరయ్య ట్రైలర్ చూశారా? -
గరం టీమ్ సంక్రాంతి సంబురాలు
-
Sankranti Festival Celebrations 2022 : సంక్రాంతి సంబురాలు
-
Sankranti Festival 2022 Celebrations: ఊరంతా సంక్రాంతి
-
పండక్కి నగదు కష్టాలు
సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి పండగకు నగదు కష్టాలు వెంటాడుతున్నాయి. సామాన్యుడు, ఉన్నత వర్గం అనే తేడా లేకుండా పైసల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పండగ రోజున జేబులు ఖాళీగా ఉండటంతో ఏమీ తోచని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. డిజిటల్ షాపింగ్ చేద్దామంటే చాలా చోట్ల స్వైపింగ్ మిషన్లు కూడా మొరాయిస్తున్నాయి. నగదు కొరతతో బ్యాంకులు చేతులెత్తేశాయి. అటు జీవీఎంసీ సహా పలు సంస్థలకు సంబంధించిన కొంతమంది కార్మికులకు జీతాలు డ్రా చేసేందుకు బ్యాంకులు రిక్తహస్తాలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నగరంలోని ఏటీఎంలలో రూ.8 కోట్ల నగదుని ఆదివారం రోజున అందుబాటులో ఉంచుతారని ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ జిల్లా స్థాయి అధికారితో నగదు కష్టాలపై సంప్రదింపులు జరిపానన్నారు. ఈ నేపథ్యంలో రూ.8 కోట్లను దాదాపు అని ఏటీఎంలలో సర్దుబాటు చేయనున్నట్టు చెప్పారు. నగరంలో ఉన్న 45 బ్యాంకులకు సంబంధించి 707 బ్రాంచిలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 1134 ఏటీఎంలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఏటీఎంలో కనీసం 5 లక్షలు నగదు అందుబాటులో ఉంచినా.. సుమారు రూ.57 కోట్లు కావాలి. దీనికి తోడు శని, ఆది, సోమవారాలు సెలవు దినాలు కావడంతో మరో 3 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. దీంతో అత్యవసర నగదు కోసం ఏటీఎంలను ఆశ్రయించాల్సిందే. కానీ.. ఆదివారం ఉంచనున్న 8 కోట్ల నగదు 10 నిమిషాల్లో ఖాళీ అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు నగర వాసులకు నగదు అందుబాటులో ఉండే అవకాశాలు లేవు. -
కరెన్సీకి కటకట..
పెద్ద పండుగ వేళ కరెన్సీ కష్టాలు వచ్చిపడ్డాయి. నగదు కొరతతో సం‘క్రాంతి’ మసకబారుతోంది. గత ఏడాది పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో పల్లె పండుగను సందడిగా చేసుకోలేకపోయారు. అంతకుముందు సంవత్సరం కరువు దెబ్బతీసింది. ఈసారైనా ఇంటిల్లిపాది సంతోషంగా పండుగ చేసుకుందామనుకుంటే కరెన్సీ కష్టాలు మళ్లీ వచ్చిపడ్డాయి. సాక్షి, కర్నూలు: నగదు కొరతతో బ్యాంకుల్లో పరిమిత చెల్లింపులే చేస్తున్నారు. ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఖాతాల్లో డబ్బున్నా తీసుకోలేని పరిస్థితి. కనీసం రూ.2 వేలు కావాలన్నా 10–15 ఏటీఎం కేంద్రాలకు తిరగాలి. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు దొరక్క.. చేతిలో చిల్లిగవ్వ లేక అన్ని వర్గాల ప్రజలు అవస్థ పడుతున్నారు. పల్లెల్లో ఇంకా పండుగ కళ కన్పించడం లేదు. కిరాణ, ఇతర సరుకుల దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఫ్యాన్సీ అమ్మకాలదీ అదే పరిస్థితి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమతో నాలుగు రోజుల పాటు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సందడిగా చేసుకునే పెద్ద పండుగ ఇది. ప్రధానంగా రైతుల పండుగ కావడంతో పల్లెల్లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇళ్లకు సున్నం పూయించడం, రంగులు వేయించడం, వాహనాలను అలంకరించడం మొదలు.. ఇంటికి వచ్చే బంధువులకు పిండివంటల తయారీ, వస్త్రాల కొనుగోలు, వివిధ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి వస్త్రాలు, సంక్రాంతి కానుకలు అందజేయడం వంటివి చేస్తారు. ఇవన్నీ ఆర్థిక లావాదేవీలతో ముడిపడినవే. సంక్రాంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రూ.300 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అంచనా. బ్యాంకుల్లో నో క్యాష్ జిల్లా వ్యాప్తంగా 450కి పైగా ఏటీఎంలు ఉన్నాయి. అధికశాతం ఏటీఎంల్లో ఔట్ ఆఫ్ సర్వీస్, నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. మిగిలిన వాటిలోనూ తక్కువ మొత్తంలోనే నగదు విత్‌డ్రా అవుతోంది. నగదు కొరతతో ప్రధాన బ్యాంకులు రూ.20,000 నుంచి రూ.30,000లోపు మాత్రమే చెల్లింపులు చేస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రూ.2 వేల నోట్ల ముద్రణను ఇప్పటికే రిజర్వు బ్యాంకు నిలిపివేయడం, మార్కెట్లోకి వచ్చిన పెద్ద నోట్లు చాలా వరకు కొందరు సంపన్నుల వద్ద ఉండిపోవడం తదితర కారణాలతో ప్రస్తుత కొరత ఏర్పడిందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. కళ తప్పిన రైతు మోము రైతుల ఇంట పండుగ కాంతులు కరువయ్యాయి. జిల్లాలో 40,53,000 మంది జనాభా ఉన్నారు. సుమారు ఏడు లక్షల రైతు కుటుంబాలున్నాయి. సంక్రాంతి వ్యాపారం చాలా వరకు తొలకరి ఫలసాయంపైనే ఆధారపడి ఉంటుంది. మంచి పంట దిగుబడులు వచ్చాయన్న ఆనందాన్ని నగదు కొరత ఆవిరి చేస్తోంది. ఖాతాల్లో డబ్బున్నా.. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వెలవెలబోతున్న పండుగ వ్యాపారం.. జిల్లాలో వాణిజ్య కేంద్రాలైన కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ తదితర పట్టణాల్లో ఏటా సంక్రాంతి సీజన్లో జరిగే వ్యాపారంతో పోలిస్తే ఈసారి ఇప్పటి వరకు 25శాతం మేర కూడా జరగలేదు. మోటార్‌బైక్‌ల మేళాల్లోనూ ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవని డీలర్లు అంటున్నారు. నగదు కొరతే ఇందుకు కారణమని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఇబ్బందులు పడుతున్నాం నగదు కోసం బ్యాంకులకు వెళితే రద్దీ, ఇతర కారణాలతో నగదు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం తలెత్తుతోంది. ఏటీఎం కేంద్రాలకు వెళితే నోక్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తోటలకు ఎరువులు, పురుగు మందు కొనుగోలు చేయాలంటే నగదు కొరత వేధిస్తోంది. – కల్లా ఎల్లారెడ్డి, రైతు, లాలుమానుపల్లె నగదు కొరత నివారించాలి ఏటీఎంలలో నగదు కొరత లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. పండుగ వేళ సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. – ఎన్ఎస్ బాబు, యూటీఎఫ్ నాయకులు ఊరు విడిచి వెళ్లాలంటే కష్టం ఏదైనా పనిపై వేరే ఊరు వెళ్లాలంటే నగదు కొరతతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏటీఎంపై నమ్మకంతో విజయవాడకు వెళితే అక్కడ కూడా నగదు కొరత వెంటాడింది. – క్రిష్ణమోహన్, ఏపీ ఎన్జీఓ సం«ఘం నాయకులు -
ఊరు పిలుస్తోంది
సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో విజయవాడలో చదువుకుంటున్న విద్యార్థులు, ఉద్యోగులు బుధవారం స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్, రైల్వేస్టేషన్ కిటకిటలాడాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడిపింది. విజయవాడ: పండిట్ నెహ్రూ బస్టాండ్ బుధవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. నగరంలోని విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు స్వస్థలాలకు చేరుకునేందుకు తరలివచ్చారు. దీంతో బస్టాండ్ ప్రాంగణం రద్దీగా కనిపించింది. బుకింగ్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు షెడ్యూల్ ప్రకారం కాకుండా అదనపు సర్వీసులు నడిపారు. పలు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు కడప సెక్టార్ వైపు యాచోటు, అనంతపురం, పులివెందుల, కర్నూలు తదితర ప్రాంతాలకు 85 అదనపు సర్వీసులు, రాజమండ్రి, కాకినాడ, భద్రాచలం తదితర రూట్లలో 50 మెట్రో, సూపర్ లగ్జరీ, డీలక్స్ సర్వీసులు ప్రత్యేకంగా నడిచాయి. పలు కళాశాలల యాజమాన్యం విద్యార్థుల సౌకర్యార్థం 30 సిటీ సర్వీసులను ఏర్పాటు చేసుకున్నాయి. హైదరాబాద్‌కు 80 ప్రత్యేక బస్సులు నడిపారు. – బస్‌స్టేషన్ (విజయవాడ తూర్పు) -
‘పుంజు’కుంటున్నాయ్
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం : సంక్రాంతి సమీపిస్తోంది. సంబరాల మాటున ఇప్పటికే చాటుమాటున కోడి పందేలు మొదలయ్యాయి. భోగి మొదలుకుని కనుమ వరకు భారీఎత్తున పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. కోళ్లను బరిలోకి దింపేందుకు నేతలు, పందేలరాయుళ్లు సై అంటున్నారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని, పందేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు ఎప్పటిలా గంభీరంగా ప్రకటిస్తున్నారు. రాజకీయ నేతలు రంగంలోకి దిగుతుండటంతో పోలీస్ ప్రకటనలు అమలవుతాయా లేక తాటాకు చప్పుళ్లుగానే మిగిలిపోతాయా అనేది త్వరలోనే తేలనుంది. తీరప్రాంతాలే వేదికగా.. కోడి పందేలకు తీర ప్రాంతాలను వేదికగా చేసుకుంటున్నారు. విడవలూరు మండలం రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో పందేలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఊటుకూరు పంచాయతీ పరిధిలో గత ఏడాది ఆగిన పందేలను ఈసారి కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు, జొన్నవాడ పెన్నా నదిలో ఇప్పటికే చాటుమాటుగా పందేలను నిర్వహిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతాల్లో పందేలు నిర్వహించి, పోలీసులకు దొరికిన విషయం తెలిసిందే. సంగం మండలం దువ్వూరు, మక్తాపురం ప్రాంతాల్లో ఏర్పాట్లు పుంజుకుంటున్నాయి. బుచ్చిరెడ్డిపాళెం వవ్వేరు ప్రాంతంలోనే గతంలో కోడిపందేలు వేసేవారు. బయట ప్రాంతాల నుంచి వచ్చి మరీ పందేలు నిర్వహించేవారు. ఈసారి పందేలు వేసే బరులు మరింతగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. పుంజులకు డిమాండ్ బుచ్చిరెడ్డిపాళెంలో పందెం పుంజులకు మంచి డిమాండ్ ఏర్పడింది. కొందరు బాదం, పిస్తా, జీడిపప్పుతో కూడిన పౌష్టికాహారం అందించి మరీ వాటిని పెంచుతున్నారు. కొందరైతే పుంజులకు మద్యం సైతం తాగిస్తున్నారు. బయట ప్రాంతాల వారు వీటిని కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్ ఏర్పడటంతో పందెం కోళ్ల ధరలు వేలాది రూపాయలు పలుకుతున్నాయి. రూ.వంద నుంచి లక్షల్లో.. దామరమడుగు పెన్నా నదిలో సుదూరంగా ఇప్పటికే కోడి పందేలు వేస్తున్నారు. రూ.వంద నుంచి రూ.లక్షల పందెం కడుతున్నారు. ఇక్కడి బరుల్లో ప్రస్తుతం 10 నుంచి 20 మంది పాల్గొంటుండగా.. సంక్రాంతి నాటికి వందలాది మందితో జరిగే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాలు అమలయ్యేనా! కోడి పందేలు నిర్వహించడం నేరమని హైకోర్టు నిషేధం విధించింది. ఇవి జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. పోలీసులు సైతం వీటిని జరగనివ్వబోమని చెబుతున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ 1960, ఏపీ గేమింగ్ యాక్ట్ 1974 ప్రకారం కేసులు నమోదు చేస్తామని చెబుతున్నారు. అయితే, చివరి వరకు ఈ మాటపై నిలబడతారా లేదా అనేది చర్చనీయాంశమైంది. నిజాయితీ అధికారిగా పేరు తెచ్చుకున్న ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఆధ్వర్యంలో కోడిపందేలకు చెక్ పడుతుందని పలువురు భావిస్తున్నారు. -
తెరపై సంక్రాంతి
-
సంక్రాంతిపై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్
-
సంక్రాంతి సంబరాల్లో ఎంజాయ్ చేసిన విదేశీయులు
-
సంక్రాంతి పండుగ సరదాల కోసం సర్వం సిద్ధం
-
సెలవు సెగలు
► కేంద్రం నిర్ణయంపై సర్వత్రా నిరసన ► నేడు స్టాలిన్ ఆందోళన ► జల్లికట్టు కోసం పోరాటాలు పొంగల్ పండుగ సెలవులు, జల్లికట్టు క్రీడలపై రాష్ట్రం అట్టుడికిపోతోంది. రెండు అంశాల్లోనూ కేం ద్రం వైఖరిని ఎండగడుతున్నారు. పొంగల్ పండుగకు ఏటా ఇచ్చే సాధారణ సెలవును ఐచ్చిక సెలవు(ఆప్షనల్ హాలిడే)గా మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రం లో సెగలు పుట్టించింది. ప్రజలను ఆగ్రహోదగ్రులను చేయగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సంయుక్తంగా పోరుబాట పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజలకు పొంగల్ అత్యంత ప్రధానమైన పండుగ. ప్రతి ఒక్కరూ తమ స్వగ్రామాలకు వెళ్లి బంధుమిత్రులతో సందడి చేసుకుంటారు. అయితే ఈసారి ఆ వెసులుబాటు లేకుండా పండుగ జరుపుకునే వారు మాత్రమే సెలవు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షరతు విధించడం విమర్శలకు దారితీసింది. దీంతో ఉద్యోగులు, ప్రజలు పోరుబాట పట్టారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ మంగళవారం చెన్నై మైలాపూరు, టీ నగర్ పోస్టల్ కార్యాలయాల వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. నుంగంబాక్కంలోని శాస్రి్తభవన్ వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మహాసమ్మేళన్ తరఫున చెన్నై చేపాక్ సమీపంలో సాయంత్రం ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉండగా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ నేతృత్వంలో బుధవారం చెన్నై వల్లువర్‌కోట్టం వద్ద ధర్నా చేపట్టనున్నారు. పొంగల్ సెలవును సాధారణ సెలవుల్లో చేర్చాలని కోరుతూ సీఎం పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ప్రధానికి లేఖలు రాశారు. పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు అన్బుమణి, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కూడా ప్రధానికి లేఖలు రాశారు. సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, వామపక్షాలు సైతం కేంద్రాన్ని తప్పుపట్టారు. సెలవుపై రాజకీయమా: కేంద్ర మంత్రి పొన్ పొంగల్ పండుగ రెండో శనివారం రావడం వల్లనే సాధారణ సెలవు దినంగా ప్రకటించలేదని, కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నాయని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ చెప్పారు. ఎనిమిదేళ్లుగా ఏ కేటగిరిలో ఉందో నేడు అలానే కొనసాగుతోందని ఆయన వివరించారు. కాంగ్రెస్, డీఎంకే హయాంలో జరిగిన తప్పులను సరిచేసేందుకు శ్రమించాల్సి వస్తోందని జల్లికట్టు అనుమతులపై పొన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, డీఎంకేలు చేసిన తప్పును అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రతిఘటించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై ఆరోపించారు. జల్లికట్టు కోసం... ఇదిలా ఉండగా, పొంగల్ పండుగ సమయంలో జరుపుకునే సంప్రదాయ జల్లికట్టు క్రీడకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు. జల్లికట్టు క్రీడాకారులేగాక విద్యార్థినీవిద్యార్థులు సైతం జల్లికట్టు కోసం పట్టుబడుతున్నారు. పుదుక్కోట్టై, కుంభకోణం, శివగంగై, కారైక్కుడి, మధురై, సేలం తదితర ప్రాంతాల్లో మంగళవారం ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. జల్లికట్టు ఆందోళనలకు పెద్ద సంఖ్యలో తరలి రావాల్సిందిగా సినీ దర్శకుడు గౌతమన్ యువకులకు పిలుపునిచ్చారు. జల్లికట్టుపై నిషేధంపై కాంగ్రెస్‌ను నిందించడం సరికాదని టీఎన్ సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కు హితవు పలికారు. -
విజయవాడ నుంచి 250 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ
విజయవాడ : సంక్రాంతి పండగ కోసం సొంత ఊళ్లకు వెళ్లి.... మళ్లీ గమ్యస్థానాలకు తిరిగి ప్రయాణమయ్యే వారి కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు శనివారం విజయవాడలో ఓ ప్రకటనలో వెల్లడించారు. అందుకోసం విజయవాడ నగరం నుంచి 250 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు ప్రత్యేక బస్సులతోపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఉన్నతాధికారులు వివరించారు. -
కరీంనగర్ జిల్లాలో సంక్రాంతి జాతర
-
సంక్రాంతి సందడిలో నకిలీ కరెన్సీ చలామణి
జంగారెడ్డిగూడెం : నకిలీ కరెన్సీ ముఠాలు దానిని మార్చేందుకు కొత్తదారులు కనిపెడుతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని నకిలీ కరెన్సీ మారుస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ముఠాలు చలామణి చేసే నకిలీ కరెన్సీ అసలు నోట్లను పోలి ఉండటంతో జనం గుర్తుపట్టలేకపోతున్నారు. సంక్రాంతి నేపథ్యంలో నకిలీ కరెన్సీ ముఠాలు పేకాట, గుండాట నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ముఠాలు తీసుకువచ్చిన నకిలీ నోట్లను పేకాట, గుండాట నిర్వాహకులకు అందజేస్తున్నారు. నెల క్రితమే వీటి నిర్వాహకులను గుర్తించి వారితో నేరుగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఏజెన్సీ ప్రాంతంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పేకాట, గుండాట నిర్వహిస్తారనేది గుర్తించి నకిలీ కరెన్సీ చలామణికి మార్గం సుగమం చేసుకున్నట్టు తెలిసింది. నాలుగైదు రోజు లుగా కొయ్యలగూడెం నుంచి ప్రతి రోజు లక్షలాది రూపాయల నకిలీ కరెన్సీ ఏజెన్సీ ప్రాంతానికి తరలుతోంది. బుట్టాయగూడెం మండలంలో మారుమూల ప్రాంతమైన గుళ్లపూడిలో కోతాట (లోన బయట), గుండాట పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలో ఒక రోజు వేసిన చోట మరొక రోజు పేకాట, గుండాట వేయరు. స్థలాలు మారుస్తూ అనుమానం రాకుండా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక్కడికి ప్రతి రో జు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వర కు నకిలీ కరెన్సీని తీసుకెళ్లి పేకాట, గుండా ట ఆడేందుకు వచ్చే వారికి ఆట ముసుగులో ఈ కరెన్సీని అంటగడుతున్నట్టు సమాచారం. ఆటలో భాగంగా జూదరుల నుంచి అసలు కరెన్సీ తీసుకుని నిర్వాహకుల వద్ద ఉన్న నకిలీ కరెన్సీని వారికి ఇస్తున్నారు. పాకిస్తాన్లో ముద్రించిన ఈ నకిలీ కరెన్సీ ఒడిశా నుంచి జిల్లాలోకి ప్రవేశిస్తున్న ట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో నకిలీ నోట్లు మార్చే ముఠాలపై పోలీసులు దాడి చేసి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్లు పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ముంబై నుంచి కూడా ఈ ప్రాంతానికి నకిలీ నోట్లు తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ఏజెన్సీలో అమాయకులను ఆసరాగా చేసుకుని పేకాట, గుండాటల్లో ఈ నకిలీ కరెన్సీ చలామణి చేసేస్తున్నారు. దీనిలో నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి పాత్రమైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
పాటల సంక్రాంతి
-
పట్నంలో పండగ సందడి
-
నేడు ఒక్క రోజు పనిచేస్తే చాలు ... వరుసగా సెలవులే
హైదరాబాద్ : ఈ సారి సంక్రాంతి పండుగ ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు బాగా కలిసి వచ్చింది. బుధవారం ఒక్క రోజు ఆఫీసులకు వెళితే మళ్లీ సోమవారం నాడు ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో బోగి, సంక్రాంతికి రెండు రోజులు మాత్రమే ప్రభుత్వ సెలవులుండేవి. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సారి సంక్రాంతికి మూడు రోజుల సెలవులను ప్రకటించింది. బోగి, సంక్రాంతి, కనుమ పండుగకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులను ప్రకటించింది. గురువారం నుంచి శనివారం వరకు పండుగ సెలవులైతే ఆదివారం వారాంతపు సెలవు వచ్చింది. దీంతో పండుగకు ఊర్లు వెళ్లేందుకు ఉద్యోగులకు, అధికారులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు కలిసి వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి గ్రామాలకు పెద్ద సంఖ్యలో జనం తరలివెళ్లేవారు. గ్రామాలకు తరలి వెళ్లే వారి కోసం జంటనగరాల్లో తిరిగే సిటీ బస్సులను ఆంధ్రా ప్రాంతాలకు నడిపేవారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ సిటీ బస్సులను ఎల్బినగర్ నుంచి ఆంధ్రా ప్రాంతానికి ఆర్టీసీ నడుపుతోంది. రెండో శనివారం, ఆదివారం వరుసగా సెలవులు రావడంతో సగం మంది జనం గత శుక్రవారమే సంక్రాంతి పండుగకు గ్రామాలకు తరలివెళ్లారు. మిగతా వారు బుధవారం ఆఫీసు ముగిసాక గ్రామాలకు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సంక్రాంతికి సొంత ఊరిలో సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చితూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు. ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నాం విజయవాడ నుంచి బయలుదేరి నారావారిపల్లెకు వెళ్తారు. 16వ తేదీ మధ్యాహ్నాం వరకు నారావారిపల్లెలోనే ఉంటారు. సంక్రాంతి పండుగను అక్కడే జరుపుకుంటారు. 16వ తేదీ మధ్యాహ్నాం బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు. 17వ తేదీ సాయంత్రం విజయవాడ నుంచి బయలుదేరి కర్నాటకలోని ఉడిపికి వెళ్తారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని 18వ తేదీ ఉదయం బయలుదేరి విజయవాడకు చేరుకుంటారు. -
సంక్రాంతికి 1854 అదనపు బస్సులు
హైదరాబాద్ : సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు అదనపు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గంగాధర్ వెల్లడించారు. ఇరు రాష్ట్రాల్లో 1854 బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఏపీలో 948 బస్సులు, తెలంగాణలో 913 అదనపు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గంగాధర్ తెలిపారు. అయితే సంక్రాంతి పండగ పురస్కరించుకుని ఇప్పటికే హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు స్వస్థలాలకు రైళ్లు, బస్సుల్లో కిక్కిరి వెళ్తున్న సంగతి తెలిసిందే. -
చంద్రన్న కానుకల గౌడన్లు ఆకస్మిక తనిఖీలు
-
'కోడిపందాల కోసం కాదు.. సంబరాల కోసమే వెళ్తున్నా'
హైదరాబాద్ : ఈ ఏడాది సంకాంత్రి పండగకి కూడా ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం వెళ్తున్నట్లు తెలంగాణ వాణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వెల్లడించారు. అయితే కోడిపందాల కోసం మాత్రం కాదని... సంక్రాంతి సంబరాల కోసమే అని తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ... పేదలకు న్యాయం జరగాలన్నదే తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ఇద్దరు సీఎంలు పరస్పరం గౌరవించుకుంటున్నారని చెప్పారు. అభివృద్ధి కోసం పరస్పరం సహకరించుకోవడంలో తప్పు లేదని తలసాని అన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందడమే ముఖ్యమని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు టీఆర్ఎస్పై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాయని... అ పద్దతి సరికాదని తలసాని శ్రీనివాసయాదవ్ వ్యాఖ్యానించారు. మరో మూడు ఏళ్లలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఉండదని చెప్పారు. నగరంలో మేం చేసిన అభివృద్ధి.... చేయాల్సిన దానిపై నగర ప్రజలకు వివరిస్తామని తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందని తలసాని ధీమా వ్యక్తం చేశారు. -
పండగ చేసుకున్నారు.. ఇక పనిచేయాలి
నిన్నటి వరకు పండుగలు చేసుకున్నారు.. ఇక ఇప్పుడు అంతా కలిసి పనిచేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలోనే తాము స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అనే మూడింటిని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ 19వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసుకున్నామన్నారు. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ను మర్చిపోలేమని ఆయన తెలిపారు. తాను పశ్చిమగోదావరి జిల్లాలో 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నానని, ప్రగతి కోసం, ప్రజల్లో చైతన్యం తేవడం కోసమే ప్రజాఉద్యమం పేరిట ఈ కార్యక్రమం చేపడుతున్నానని చంద్రబాబు అన్నారు. 12 వేలకు పైగా గ్రామాలు, 3 వేలకు పైగా మునిసిపల్ వార్డులను ఈ కార్యక్రమం కింద గుర్తించామన్నారు. -
తెలుగు ప్రజలకు నరసింహన్ సంక్రాంతి శుభాకాంక్షలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. -
ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు
-
ప్రైవేట్ ట్రావెల్స్‌పై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు
విజయవాడ: రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారుల దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లాలో 6, పశ్చిమగోదావరి జిల్లాలో 6, ప్రకాశంలో 2, కడపలో ఒక బస్సును ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకుని జప్తు చేశారు. అలాగే మరో 9 బస్సులను కూడా స్వాధీనం చేసుకుని రవాణశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. -
జల్లికట్టుకు సిద్ధం
చెన్నై, సాక్షి ప్రతినిధి:తమిళులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ పొంగల్. గ్రామీణ వాతావరణం వెల్లివిరిసే పొంగల్ పండుగలో జల్లికట్టు నిర్వహణ హైలెట్. మదించిన దున్నను అదుపు చేసిన వారు స్వగ్రామాల్లో హీరోగా చలామణి అవుతారు. ఏడాది పొడవునా అతనికి ఆ గౌరవం దక్కుతుంది. జల్లికట్టు ప్రమాదకరమని తెలిసినా యువత వెనక్కు తగ్గడం లేదు. మదురై, అలంగానల్లూరు, పుదుక్కోట్టై, కారైక్కుడి, శివగంగై, సేలం, తేనీ తదితర ప్రాంతాల్లో జల్లికట్టు హోరాహోరీగా సాగుతుంది. అలంగానల్లూరు ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ సాగే జల్లికట్టును చూసేందుకు విదేశీ యులు సైతం తరలి వస్తారు. తమిళనాడులో ఇంతటి ప్రాముఖ్య ం సంతరించుకున్న జల్లికట్టుపై గతేడాది నిషేధం వేటు పడింది. మదురై జిల్లా అలంగానల్లూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి జల్లికట్టుపై నిషేధం విధించాలని కోరుతూ 2006లో కోర్టులో పిటిషన్ వేశారు. జల్లికట్టు అత్యంత ప్రమాదంగా పరిణమించిందని, ఎందరో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వికృత క్రీడ బారినపడి 2012న రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారని, 33 మంది తీవ్రంగా గాయ పడ్డారని తెలిపారు. జల్లికట్టులో పాల్గొనే దున్న చేత మద్యం తాగిస్తారంటూ జంతు ప్రేమికులు అభ్యంతరాలు లేవనెత్తారు. జంతుప్రేమికుల సంఘం రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు జల్లికట్టుపై నిషేధం విధిస్తూ గత ఏడాది మే 7న తీర్పు చెప్పింది. జల్లికట్టుకు సీఎం ఏర్పాట్లు గతేడాది పొంగల్ పండుగలో జల్లికట్టు ముగిసిన తర్వాత సుప్రీం కోర్టు తీర్పు వెలువడడంతో ప్రభావం కనిపించలేదు. అయితే ఈ ఏడాది జల్లికట్టు జరిగేనా అనే ఉత్కంఠ నెలకొంది. రాజకీయ పక్షాలన్నీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రారంభించాయి. ప్రజలు సైతం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా జల్లికట్టు నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శనివారం ప్రకటించారు. నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టులో తీర్పు వెలువడగానే ప్రభుత్వం తరపున అప్పీలు చేశామని తెలిపా రు. అప్పీలుపై విచారణ జరుగుతున్నందున జల్లికట్టును నిర్వ హించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. క్రీడలో దున్నలను వినియోగించరాదని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహ రించాలని కోరుతూ ఈ నెల 7న ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం ఢిల్లీకి వెళ్లిందన్నారు. ఈ నెల 12న మరోసారి వెళుతుందని చెప్పారు. కేంద్రం సైతం తమ సంప్రదాయానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పన్నీర్‌సెల్వం తెలిపారు. కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడగానే ప్రణాళికాబద్ధంగా జల్లికట్టు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
ముక్కకు మూడుకోట్లు!
పండగ మూడు రోజులూ మాంసాహారం కోసం జిల్లా వాసులు భారీగా ఖర్చు చేశారు. భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాల్లో గతంలో ఎన్నడూలేని విధంగా దాదాపు రూ 3 కోట్ల మాంసాన్ని చక్కగా చప్పరించేశారు. వేకువజామున నాలుగు గంటల నుంచే మాంసం కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద క్యూ కట్టారు. వేల సంఖ్యలో కోళ్లు, గొర్రెల తలలు తెగిపడ్డాయి. ఒక్క నెల్లిమర్ల నగర పంచాయతీ విషయమే తీసుకుంటే..ఇక్కడున్న 50 మాంసం దుకాణాల ద్వారా భోగి నుంచి కనుమ వరకూ సుమారు పది లక్షల రూపాయల మాంసం విక్రయాలు జరిగాయి. జిల్లా కేంద్రంలో అత్యధికంగా రూ.30 లక్షలపైనే మాంసం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. ఓ వైపు మటన్, చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయినా జిల్లావాసులు ఎంతమాత్రం జంకలేదు. భోగీ, సంక్రాంతి నాడు కొంతమందే మాంసాహారం తీసుకున్నా, కనుమ రోజు దాదాపు అందరూ నోట ముక్క పెట్టారు. ప్రస్తుతం మటన్ ధర రూ.440 కాగా, చికెన్ ధర రూ 160గా ఉంది. మొన్నటిదాకా బాగా తక్కువగా ఉన్న చికెన్, మటన్ ధరలు పండగ రోజుల్లో అమాంతం పెరిగాయి. భోగికి ముందు వారం రోజుల నుంచి ధరలు చుక్కలను అంటాయి. అయినా సంక్రాంతి ప్రధాన పండగ కావడంతో జిల్లావాసులు మాంసం కొనుగోళ్ల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. భోగి మొదలుకొని కనుమ దాకా జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీలోనే అత్యధికంగా మాంసం విక్రయాలు జరిగాయి. ప్రతి మున్సిపాలిటీలోనూ పది లక్షల రూపాయలకు తక్కువ గాకుండా మాంసం విక్రయాలు జరిగాయి. అలాగే 34 మండల కేంద్రాల్లోనూ అధికంగా అమ్ముడుపోయింది. ఎక్కడా ఐదు లక్షలకు తక్కువకాకుండా మాంసం విక్రయాలు జరిగాయి. దాదాపు అన్ని గ్రామాల్లోనూ పండగ సందర్భంగా మాంసం దుకాణాలు వెలిశాయి. ఒక్క కనుమనాడే భారీ సంఖ్యలో గొర్రెలు, కోళ్ల తలలు తెగిపడ్డాయి. వేకువజామున నాలుగు గంటల నుంచే జిల్లా కేంద్రంలోనూ, మున్సిపాలిటీల్లోనూ, మండల కేంద్రాల్లోనూ మాంసం విక్రయాలు మొదలయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటల తర్వాత మాంసం దొరకలేదు. ముఖ్యంగా మటన్ ధర రూ 440కి పెరిగినా కొనుగోలు చేసేందుకు జిల్లావాసులు వెనుకాడలేదు. డిమాండ్ పెరగడంతో దుకాణదారులు అప్పటికప్పుడే ధరలను పెంచేశారు. నాటుకోడి ప్రియులకు ఈ ఏడాది ధరలు చుక్కలు చూపించాయి. మటన్‌తో సమానంగా నాటుకోడి ధరలు సైతం అమాంతం పెరిగాయి. కిలో నాటుకోడి మాంసం రూ.300 పైనే పలికింది. ముక్కనుమ సందర్భంగా శుక్రవారం కూడా మాంసం విక్రయాలు ఎక్కువగానే ఉంటాయి. కొత్త అల్లుళ్లు, దూరప్రాంతాల నుంచి విచ్చేసిన బంధువులున్న వారు శుక్రవారం కూడా భారీగానే కొనుగోలు చేస్తారు. దీంతో జిల్లావ్యాప్తంగా మాంసం విక్రయాలు మరింత పెరిగే అవకాశముంది. -
జల్లికట్టు క్రీడలో 41 మందికి గాయాలు
సంక్రాంతి పండగ నేపథ్యంలో పలమేడులో నిర్వహించిన జల్లికట్టు క్రీడలో సుమారు 41 మంది గాయపడినట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఏడుగురిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, మిగితావారిని ప్రాథమిక చికిత్సనందించామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి జల్లు కట్టు క్రీడలో పాల్గొనేందుకు సుమారు 530 ఎడ్లు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడను చూసేందుకు విదేశీయులు పలమేడుకు చేరుకున్నారన్నారు. జంతువులను హింసిస్తున్నారనే జంతు సంరక్షణ కార్యకర్తలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు, తమిళనాడు జల్లికట్టు రెగ్యులేషన్ యాక్ట్ నియమాల ప్రకారం జల్లు కట్టు క్రీడను నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎడ్లకు ఎలాంటి మత్తు పదార్థాలు వినియోగించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని రకాల పరీక్షలు పూర్తయిన తర్వాతనే పోటీలకు అనుమతించారు.