జల్లికట్టు క్రీడలో 41 మందికి గాయాలు
Published Wed, Jan 15 2014 5:18 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
సంక్రాంతి పండగ నేపథ్యంలో పలమేడులో నిర్వహించిన జల్లికట్టు క్రీడలో సుమారు 41 మంది గాయపడినట్టు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఏడుగురిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, మిగితావారిని ప్రాథమిక చికిత్సనందించామని పోలీసులు తెలిపారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి జల్లు కట్టు క్రీడలో పాల్గొనేందుకు సుమారు 530 ఎడ్లు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడను చూసేందుకు విదేశీయులు పలమేడుకు చేరుకున్నారన్నారు.
జంతువులను హింసిస్తున్నారనే జంతు సంరక్షణ కార్యకర్తలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టు, తమిళనాడు జల్లికట్టు రెగ్యులేషన్ యాక్ట్ నియమాల ప్రకారం జల్లు కట్టు క్రీడను నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎడ్లకు ఎలాంటి మత్తు పదార్థాలు వినియోగించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని రకాల పరీక్షలు పూర్తయిన తర్వాతనే పోటీలకు అనుమతించారు.
Advertisement