సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు అదనపు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గంగాధర్ వెల్లడించారు.
హైదరాబాద్ : సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు అదనపు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గంగాధర్ వెల్లడించారు. ఇరు రాష్ట్రాల్లో 1854 బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఏపీలో 948 బస్సులు, తెలంగాణలో 913 అదనపు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ గంగాధర్ తెలిపారు.
అయితే సంక్రాంతి పండగ పురస్కరించుకుని ఇప్పటికే హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు స్వస్థలాలకు రైళ్లు, బస్సుల్లో కిక్కిరి వెళ్తున్న సంగతి తెలిసిందే.