సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఈనెల 7 నుంచి 14 వరకు హైదరా బాద్ నుంచి ఏపీలోని 13 జిల్లాల్లోని వివిధ పట్టణాలకు 1,500 ప్రత్యేక బస్సులు నడపను న్నట్లు సంస్థ హైదరాబాద్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే ప్రతిరోజూ 344 రెగ్యులర్ బస్సులను హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్, మియా పూర్, కూకట్‌పల్లి, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, ఎంజీబీఎస్, ఎల్‌బీనగర్, జీడిమెట్ల, జేబీఎస్, ఈసీఐఎల్ నుంచి నడుపుతున్న ఆర్టీసీ.. పండుగ స్పెషల్స్‌ను అదనంగా ఏర్పాటు చేసి నట్లు చెప్పారు. రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు వైపు వెళ్లే బస్సులను ఎంజీబీఎస్ బయటున్న ఓల్డ్ సీబీఎస్ హాంగర్ నుంచి నడపనున్నట్లు తెలిపారు. ప్రత్యేక బస్సులకు కూడా అడ్వాన్స్ రిజర్వేషన్ కల్పిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment