బస్ పాస్‌లున్నా.. ఆర్టీసీ బస్సు రాకపోవడంతో కోపల్లె జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. పెదఅమిరం గ్రామానికి చెందిన
పాస్‌లున్నా.. బస్సు రాదు
Jan 30 2014 3:25 AM | Updated on Sep 2 2017 3:09 AM
కాళ్ల, న్యూస్‌లైన్ : బస్ పాస్‌లున్నా.. ఆర్టీసీ బస్సు రాకపోవడంతో కోపల్లె జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు అగచాట్లు పడుతున్నారు. పెదఅమిరం గ్రామానికి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు కోపల్లె జెడ్పీ హైస్కూల్‌లో చదువుతున్నారు. సుమారు 150 మందికి ఆర్టీసీ బస్ పాస్‌లు ఉన్నాయి. స్కూల్ తెరిచే సమయానికి, విడిచిపెట్టే సమయానికి బస్సు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు కోసం చూసిచూసి చివరకు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. సాయంత్రం 4.45 గంటలకు తరగతుల నుంచి బయటకొస్తున్న విద్యార్థులు 6 గంటల వరకు బస్సు కోసం వేచి ఉంటున్నారు. అయినా బస్సు రావటం లేదు. దీంతో రానుపోను రూ.15 వరకూ ఆటో చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ముఖ్యంగా బాలికలు ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ తెరిచే సమయంలోను, స్కూల్ వదిలే సమయంలోనూ బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Advertisement
Advertisement