
మార్పులు లేకుండానే...
ఆసీస్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు
ముంబై: సొంతగడ్డపై విజయయాత్రను కొనసాగిస్తూ బంగ్లాదేశ్‌ను కూడా చిత్తు చేసిన జట్టుపైనే భారత సెలక్టర్లు నమ్మకముంచారు. 16 మంది సభ్యుల ఈ టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయకుండానే ఆసీస్‌తో తలపడే జట్టును ప్రకటించారు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ మంగళవారం తొలి రెండు టెస్టుల కోసం జట్టును ఎంపిక చేసింది. ఫిట్‌నెస్ సమస్యలతో షమీ, మిశ్రా పేర్లను పరిగణలోకి తీసుకోలేదు. ఈనెల 23 నుంచి 27 వరకు పుణేలో తొలి టెస్టు, మార్చి 4 నుంచి 8 వరకు బెంగళూరులో రెండో టెస్టు జరుగుతుంది.
జట్టు వివరాలు
విరాట్ కోహ్లి (కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్‌యాదవ్, కరుణ్ నాయర్, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్, హార్దిక్ పాండ్యా.