Australia Test series
-
క్రికెటర్లకు ఆనంద్ మహేంద్ర ఊహించని గిఫ్ట్
ఆస్ట్రేలియాలో అదరగొట్టిన క్రికెటర్లకు కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా క్రికెటర్లకు ఊహించని బహుమతి లభించనుంది. ప్రతిభ గల వారిని ఎప్పుడూ ప్రోత్సహించే వారిలో మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర ముందుంటారు. టెస్ట్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చి అద్భుత ప్రదర్శన చేసిన ఆరు మంద్రి క్రికెటర్లకు మహేంద్ర ఎస్యూవీ వాహనాలు అందిస్తానని ప్రకటించారు. అది కూడా తన వ్యక్తిగత ఖాతా నుంచి అందిస్తానని ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియా టెస్ట్ (బోర్డర్ గావస్కర్ సిరీస్)తో అరంగేట్రం చేసిన శార్దూల్ ఠాకూర్, హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, నవ్‌దీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, నటరాజన్‌లకు తమ కంపెనీకి చెందిన థార్ ఎస్యూవీ కార్లను బహుమతిగా ఇస్తానని శనివారం ఆనంద్ మహేంద్ర ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఈ ఆరుగురు తమ జీవితాల్లో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని గుర్తుచేశారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకునేలా భారతీయులకు ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా ఆనంద్ మహేంద్ర ప్రశంసించారు. Six young men made their debuts in the recent historic series #INDvAUS (Shardul’s 1 earlier appearance was short-lived due to injury)They’ve made it possible for future generations of youth in India to dream & Explore the Impossible (1/3) pic.twitter.com/XHV7sg5ebr — anand mahindra (@anandmahindra) January 23, 2021 -
బుమ్రాలా ప్రయత్నించి..
-
బుమ్రాలా ప్రయత్నించి..
జస్ప్రిత్ బూమ్రా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన తొలి ఏడాదే ప్రపంచ అత్యుత్తమ బౌలర్‌గా పేరు గడించాడు. తన దైన రీతిలో స్టన్నింగ్ యార్కర్స్‌తో, విభిన్న శైలితో అభిమానులను సొంతం చేసుకుంటున్నాడు బుమ్రా. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 21 వికెట్లతో చెలరేగిన జస్ప్రీత్ బుమ్రా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో ఆసీస్‌లోనూ బుమ్రాకు తెగ క్రేజ్ ఏర్పడింది. బుమ్రాలో బౌలింగ్ చేయాలని అనుకరించే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. (బూమ్రా స్థానంలో సిరాజ్) తాజాగా ఓ ఆసీస్ బుడ్డోడు అచ్చం బుమ్రాలా బౌలింగ్ వేసేందుకు ప్రయత్నిస్తున్న వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. బుడ్డోడు బౌలింగ్ చేస్తున్న వీడియోను క్వీన్లాండ్స్కు చెందిన మైకెల్ కర్టిన్ ట్వీట్ చేశాడు. ‘బుమ్రా.. మీరు సాధించిన టెస్టు సిరీస్ విజయంతో వచ్చిన సమస్య ఏంటంటే.. భవిష్యత్ తరం ఆసీస్ క్రికెటర్లకు స్పూర్తి కలిగించేంత’అంటూ కామెంట్ జత చేశాడు. పిల్లాడు చాలా క్యూట్‌గా ఉన్నాడు, నా అభినందనలు తెలప’మంటూ బుమ్రా స్పందించడం విశేషం. ఇక ప్రపంచకప్ దృష్ట్యా బుమ్రాకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావిస్తున్న నేపథ్యంలో ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. (ఐపీఎల్‌కు బూమ్రా దూరం?) -
ఆసీస్ క్రికెటర్ వల్లే కుల్దీప్కు వికెట్లు దక్కాయి
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తుంది. ఏమైనా అద్భుతాలు జరిగితే డ్రా అయ్యే అవకాశం తప్పా.. కోహ్లి సేనకు ఓటమి అవకాశమే లేదు. దీంతో కంగారూల గడ్డపై తొలి చారిత్రక సిరీస్ విజయానికి టీమిండియా చేరువలో ఉంది. సిడ్నీ టెస్టులో అనూహ్యంగా ఇద్దరు స్పిన్నర్లతో దిగాలన్న సారథి విరాట్ కోహ్లి వ్యూహం ఫలించింది. చివరి టెస్టు మూడో రోజు ఆటలో స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా- కుల్దీప్ యాదవ్‌లు ఆసీస్ ఆటగాళ్లను కట్టడి చేశారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో సారథి టిమ్ పైన్ వికెట్‌ను సాధించిన కుల్దీప్ మూడో రోజు ఆటలో హైలెట్‌గా నిలిచాడు. పైన్‌ను అద్భుతమైన బంతితో బోల్తాకొట్టించాడు. అయితే ఈ క్రెడిట్ ఆసీస్ మాజీ దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్కే చెందుతుందని భారత మాజీ ఆటగాడు మురళీ కార్తీక్ అభిప్రాయపడ్డాడు. మూడో రోజు ఆట ముగిసిన అనంతరం చర్చా కార్యక్రమంలో మురళీ కార్తిక్ మాట్లాడుతూ.. ‘అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టు ప్రారంభానికి ముందు కుల్దీప్కు వార్న్ సలహాలు ఇచ్చాడు. కుల్దీప్ బౌలింగ్ యాక్షన్‌లోని చిన్న లోపాలను అతడికి వివరించాడు. ఆ సలహాలు సిడ్నీ టెస్టులో కుల్దీప్కు ఎంతగానో ఉపయోగపడ్డాయని భావిస్తున్నా. టిమ్ పైన్ ఔట్ తర్వాత ఇది స్పష్టమైంది’ అంటూ కార్తీక్ వివరించాడు. ఇక మైకెల్ క్లార్క్ కూడా కుల్దీప్ బౌలింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. Kuldeep Yadav beat Tim Paine all ends up to pick up the 6th Aussie wicket! 😍 LIVE on SONY SIX and SONY TEN 3.#ChhodnaMat #AUSvIND #SPNSports pic.twitter.com/ae5Y7Q6OGf — SPN- Sports (@SPNSportsIndia) 5 January 2019 -
ఆసీస్ గురించి టెన్షన్ అక్కర్లేదు: కోహ్లీ
-
ఆసీస్ గురించి టెన్షన్ అక్కర్లేదు: కోహ్లీ
పుణే: సొంతగడ్డపై విజయయాత్రను కొనసాగిస్తూ బంగ్లాదేశ్‌ను కూడా చిత్తు చేసిన టీమిండియా మరింత కాన్ఫిడెంట్ గా ఉంది. జట్టుగా తాము ప్రస్తుతం అత్యుత్తంగా రాణించడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. పుణేలో బుధవారం మీడియాతో కోహ్లీ మాట్లాడుతూ.. 'మా జట్టు ఏంతో పటిష్టంగా ఉంది. ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు గురించి మేము ఆందోళన చెందడం లేదు. జట్టుతో పాటు ఆటగాడిగానూ, కెప్టెన్ గానూ మెరుగవుతున్నాను. ఆసీస్ జట్టులో కొందరు మాత్రమే ఫామ్ లో ఉన్నారు. నాకు 22 ఏళ్లున్ననప్పుడు 35 ఏళ్ల వ్యక్తులతో పోల్చి చూశారు. క్రమక్రమంగా నేను ఆ దశకు చేరుకుంటున్నానను. క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను' అని వివరించాడు. రేపటి (గురువారం) నుంచి ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పుణేలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియా ఆటగాళ్లు పుణేలో ప్రాక్టీస్ సెషన్లో చెమటోడుస్తున్నారు. కెప్టెన్ కోహ్లీ సహా ప్రధాన ఆటగాళ్లు నెట్ సెషన్లకే పరిమితమయ్యారు. రవీంద్ర జడేజా, అశ్విన్ బౌలింగ్ లో బ్యాట్స్ మెన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. రెండు టెస్టులకు గానూ ఎలాంటి మార్పు లేకుండా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ భారత జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 23 నుంచి 27 వరకు పుణేలో తొలి టెస్ట్, మార్చి 4 నుంచి 8 వరకు బెంగళూరులో రెండో టెస్టు జరగనున్నాయి. మరోవైపు టీమిండియానే ఫెవరెట్ గా బరిలోకి దిగుతుంది. 2013 తరహాలోనే 4-0తో మరోసారి ఆసీస్ వైట్‌వాష్‌కు గురికాక తప్పదని హర్బజన్, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. 2001లో జరిగిన సిరీస్‌లో హేడెన్ , స్లేటర్, గిల్‌క్రిస్ట్, పాంటింగ్, స్టీవ్ వాలాంటి దిగ్గజాలుండగా.. ప్రస్తుత ఆసీస్ జట్టులో స్మిత్, వార్నర్ మాత్రమే ప్రధాన ఆటగాళ్లు. అశ్విన్, జడేజాలను ఇతర బ్యాట్స్ మెన్ ఎదుర్కోవడం ప్రత్యర్ధులకు అంత ఈజీ కాదని భావిస్తున్నారు. -
మార్పులు లేకుండానే...
ఆసీస్‌తో తొలి రెండు టెస్టులకు భారత జట్టు ముంబై: సొంతగడ్డపై విజయయాత్రను కొనసాగిస్తూ బంగ్లాదేశ్‌ను కూడా చిత్తు చేసిన జట్టుపైనే భారత సెలక్టర్లు నమ్మకముంచారు. 16 మంది సభ్యుల ఈ టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయకుండానే ఆసీస్‌తో తలపడే జట్టును ప్రకటించారు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ మంగళవారం తొలి రెండు టెస్టుల కోసం జట్టును ఎంపిక చేసింది. ఫిట్నెస్ సమస్యలతో షమీ, మిశ్రా పేర్లను పరిగణలోకి తీసుకోలేదు. ఈనెల 23 నుంచి 27 వరకు పుణేలో తొలి టెస్టు, మార్చి 4 నుంచి 8 వరకు బెంగళూరులో రెండో టెస్టు జరుగుతుంది. జట్టు వివరాలు విరాట్ కోహ్లి (కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్‌యాదవ్, కరుణ్ నాయర్, జయంత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్, హార్దిక్ పాండ్యా.