
న్యూఢిల్లీ: భారత జాతీయ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకునే అన్ని అర్హతలు యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌కు ఉన్నాయని సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్‌కే ప్రసాద్ స్పష్టం చేశాడు. అతనిలో విశేషమైన టాలెంట్ దాగి ఉన్నందువల్లే జాతీయ జట్టులో తొందరగా స్థానాన్ని సాధించాడన్నాడు. ప్రధానంగా జట్టు పరిస్థితులకు తగ‍్గట్టు బ్యాటింగ్ చేసే సత్తా శుబ్‌మాన్ సొంతమన్నాడు. అటు ఓపెనర్‌గా,ఇటు మిడిల్ ఆర్డర్‌లో కూడా శుబ్‌మన్ విశేషంగా రాణించగలడన్నాడు.
న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రెగ్యులర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మల స్థానంలో శుబ్‌మన్‌ను పరీక్షిస్తామన్నాడు. అయితే శుబ్‌మాన్‌కు వరల్డ్‌కప్‌లో చోటు దక్కుతుందా? లేదా ? అనే విషయంపై ఇప్పుడేమీ మాట్లాడుదలుచుకోలేదన్నాడు. భారత్ జట్టులో శుబ్‌మన్‌కు అవకాశం కల్పించే సందర్భంలో భారత యువ జట్టు కోచ్ రాహుల్ ద‍్రవిడ్‌తో చర్చించామన్నాడు. ద్రవిడ్‌తో శుబ్‌మాన్ అంతర్జాతీయ అరంగేట‍్రంపై చర్చించిన పిదప అతనికి చోటు కల్పించే విషయంలో ఒక స్సష్టతకు వచ్చామన్నాడు. దేశవాళ్లీ మ్యాచ్‌ల్లో యువ క్రికెటర్ల ఆట ఎలా ఉందనే విషయంపై ద్రవిడ్‌తో చర్చిస్తుంటామన్నాడు. అలాగే సీనియర్ క్రికెటర్ల ఆట తీరుపై కోచ్ రవిశాస్త్రిని అడిగి తెలుసుకుంటామన్నాడు. ఇది రెగ్యులర్ జరిగే ప్రక్రియ అని ఎంఎస్‌కే అన‍్నాడు. అలా వచ్చిన అవకాశాల్ని పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలు సద్వినియోగం చేసుకోవడం కచ్చితంగా భారత జట్టుకు శుభపరిణామని సెలక్షన్ కమిటీ చీఫ్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment