భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్‌కు లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ కీలకపదవి కట్టబెట్టింది. 2024 ఐపీఎల్ సీజన్‌కు గానూ కీలకమైన స్ట్రాటెజిక్ కన్సల్టెంట్‌గా (వ్యూహాత్మక సలహాదారు) నియమించింది. గడిచిన నెలలో తమ ప్రధాన కోచ్ పదవి నుంచి ఆండీ ఫ్లవర్‌ను తప్పించి, అతని స్థానంలో ఆసీస్ మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్‌ను నియమించిన ఎల్‌ఎస్‌జీ.. తాజాగా మరో కీలక మార్పు చేసి వార్తల్లో నిలిచింది.
ఎంఎస్‌కే ప్రసాద్‌ను తమ వ్యూహాత్మక సలహాదారుగా నియమించినట్లు ఎల్‌ఎస్‌జీ యాజమాన్యం ఇవాళ (ఆగస్ట్ 17) అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా, క్రికట్ ఆపరేషన్స్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన ప్రసాద్ సేవలు తమ ఫ్రాంచైజీకి చాలా ఉపయోగపడతాయని ఎల్‌ఎస్‌జీ తమ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. కాగా, 1999, 2000 సంవత్సరాల్లో భారత్ తరఫున 17 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ప్రసాద్.. 2016 నుంచి 2020 వరకు భారత జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన సెలెక్టర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి సమయం చాలా ఉండగానే, ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా పలు ఫ్రాంచైజీలు తమ ప్రధాన కోచ్‌లను మార్చేశాయి. ఈ మార్పులకు కూడా ఎల్‌ఎస్‌జీనే శ్రీకారం చుట్టింది. తొలుత ఈ జట్టు ఆండీ ఫ్లవర్ స్థానంలో లాంగర్‌ను తమ ప్రధాన కోచ్‌గా నియమించుకోగా, ఆతర్వాత అదే ఫ్లవర్‌కు ఆర్సీబీ తమ ప్రధాన కోచ్‌గా అపాయింట్ చేసుకుంది. కొద్ది రోజుల ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా తమ ప్రధాన కోచ్ పదవి నుంచి బ్రియాన్ లారాకు ఉద్వాసన పలికి, అతని స్థానంలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు డేనియల్ వెటోరీని హెడ్‌గా కోచ్‌గా నియమించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment