
న్యూఢిల్లీ: వచ్చే వరల్డ్‌కప్‌కు తాము ఎంపిక చేసే భారత జట్టులో దినేశ్ కార్తీక్‌కు దారులు మూసుకుపోలేదని చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప‍్రసాద్ మరోమారు స్పష్టం చేశాడు. త్వరలో ఆస్ట్రేలియాతో ఆరంభమయ్యే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కార్తీక్‌కు చోటివ్వకపోవడంపై సర్వత్రా చర్చకు దారి తీసింది. దినేశ్‌ను వరల్డ్‌కప్ నుంచి తప్పించే క్రమంలోనే అతనికి ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టు నుంచి ఉద్వాసన పలికారనే విమర్శలు ఎక్కువయ్యాయి. దీనిపై హాట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంఎస్‌కు ప్రసాద్ మరోసారి క్లారిటి ఇచ్చాడు.
‘దినేశ్ కార్తీక్ వరల్డ్‌కప్ చాన్స్ లేదనే విషయాన్ని మేము చెప్పలేదు కదా. ప్రస్తుత భారత జట్టులో ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. గత కొంతకాలంగా దినేశ్ కార్తీక్ మ్యాచ్ ఫినిషింగ్ పాత్ర పోషిస్తున్నాడు. అతనికి ఇచ్చినా అవకాశాల్ని కార్తీక్ సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాడు. అయితే వికెట్ కీపర్ బ్యాకప్ స్లాట్ కూడా ముఖ్యమే. దాంతోనే రిషభ్‌కు అవకాశాలు కల్పిస్తున్నాం. దినేశ్ కార్తీక్ ప్రదర్శనపై మాకు ఎటువంటి అనుమానం లేదు. కానీ రిషభ్ పంత్ కూడా అంతే వేగంగా దూసుకొచ్చాడు. చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ పరిణితి సాధించిన క్రికెటర్ రిషభ్. ఇద్దరూ సమానంగానే వారి వారి అవకాశాల్ని ఉపయోగించుకుంటున్నారు. కాకపోతే సరైన సమయంలో జట్టు అవసరాన్ని బట్టి వారికి అవకాశాలు ఇస్తున్నాం’ అని ఎంఎస్‌కే ప్రసాద్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment