ఎమ్మెస్కేపై ధోని అభిమానుల ఆగ్రహం
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌పై ధోని అభిమానులు సోషల్ మీడియా వేదికగా గుస్సా అయ్యారు.
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌పై ధోని అభిమానులు సోషల్ మీడియా వేదికగా గుస్సా అయ్యారు. లంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో ధోని ఆటను చూశారా అని దెబ్బిపొడుస్తున్నారు. ఎందుకంటే శ్రీలంకతో సిరీస్‌కు ముందు జట్టు ఎంపిక సందర్భంగా ధోని, యువరాజ్‌ల గురించి చర్చించామని ఎమ్మెస్కే తెలిపారు. ఆశించిన ప్రదర్శన కనబర్చకపోతే ప్రత్యామ్నాయం తప్పదని పేర్కొన్నారు.
అయితే శ్రీలంకతో జరిగిన గత రెండు వన్డేల్లో ధోని అదరగొట్టడంతో ఎమ్మెస్కేపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ధోని ఆట చూస్తున్నారా.. కొందరు మాటలతో సమాధానం చెబితే మరికొందరు కొందరు చేతులతో చెబుతారని‘ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక రెండో వన్డేల్లో భువీతో, మూడో వన్డేల్లో రోహిత్‌తో ఓటమి నుంచి భారత్‌ను తన క్లాసిక్ ఇన్నింగ్స్‌తో ధోని గట్టెక్కించిన విషయం తెలిసిందే.